NPAC Rally : నాగాలాండ్ సమస్యను పరిష్కరించండి
నాగాలాండ్ పీపుల్స్ యాక్షన్ కమిటీ డిమాండ్
NPAC Rally : నాగాలాండ్ శాంతి చర్చలకు ముందస్తు పరిష్కారం కోరుతూ వేలాది మంది నాగాలాండ్ లో భారీ ర్యాలీ(NPAC Rally) చేపట్టారు. నాగాలాండ్ పీపుల్స్ యాక్షన్ కమిటీ (ఎన్పీఏసీ) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు సమర్పించారు.
ఇదే లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు. నాగాలాండ్ రాజకీయ సమస్యను మరింత ఆలస్యం చేయొద్దని వారు కోరారు. వెంటనే సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే శాంతియుత పరిష్కారం కావాలని కోరుతూ నినాదాలు చేశారు. నాగాలాండ్ లోని దిమాపూర్ లో వందలాది మంది వీధుల్లోకి వచ్చారు.
ఈ నిరసనలు, ఆందోళనలకు నాగాలాండ్ పీపుల్స్ యాక్షన్ కమిటీ నేతృత్వం వహించింది. గత కొంత కాలంగా తమకు పరిష్కారం చూపాలని కోరుతూ వస్తోంది. వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖికి మెమోరాండం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం , నాగాలాండ్ సంధానకర్తల మధ్య రాజకీయ చర్చలకు ఆస్కారం ఉందని ఈ సందర్భంగా తనను కలిసిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లవుతుందని తెలిపారు. ప్రక్రియ మొత్తం పాలనా వ్యవస్థపై భారీ నష్టాన్ని తీసుకుందంటూ వినతిపత్రంలో పేర్కొంది.
అపరిష్కృత రాజకీయ సమస్య అన్ని స్థాయిలలో ఊహాతీతమైన అవినీతి చక్రానికి దారి తీసిందంటూ పీపుల్స్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రజారోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని ఆరోపించింది.
Also Read : కోట్లు కొల్లగొట్టారు జల్సా చేస్తున్నారు