Varsha Raut ED : ఈడీ ముందుకు సంజయ్ రౌత్ భార్య
మనీ లాండరింగ్ కేసులో సమన్లు జారీ
Varsha Raut ED : మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పరించింది.
మరికొన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. ఈ సందర్భంగా ఇదే కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ కు కూడా సంబంధం ఉందంటూ గతంలో సమన్లు జారీ చేసింది.
ఆమె ఈడీ ముందుకు వచ్చింది. తాజాగా రౌత్ అరెస్ట్ తర్వాత ఆసక్తికరణ పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ మరో సారి వర్షా రౌత్ కు సమన్లు జారీ చేసింది.
తమ ముందు హాజరు కావాలంటూ విచారణ కోసం. సంజయ్ రౌత్ కుటుంబానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ గా మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది.
దీంతో సమన్లు అందుకున్న వర్షా రౌత్ ఈడీ(Varsha Raut ED) కార్యాలయానికి చేరుకున్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే శివ సేన సైనికులు అక్కడికి చేరుకున్నారు.
ఇక వర్షా రౌత్ వెంట కుమారుడు, కూతురితో పాటు సోదరుడు సునీల్ రౌత్ కూడా ఉన్నారు. హౌసింగ్ ప్రాజెక్టులో ఆరోపించిన కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఏజెన్సీ వర్షా రౌత్ ను ప్రశ్నిస్తోంది.
నాలుగు నెలల కిందట ముంబై లోని గోరె గావ్ లోని పత్రా చాల్ ను రీ డెవలప్ మెంట్ లో రూ. 1,000 కోట్ల కుంభకోణం జరగినట్లు ఈడీ ఆరోపించింది.
వర్షా రౌత్ , సంజయ్ రౌత్ తో పాటు ఇద్దరు సహచరులకు చెందిన రూ. 11 కోట్ల విలువైన ఆస్తులను డీ అటా్ చేసింది.
Also Read : రాజకీయ పక్షపాతానికి అతీతంగా ఎదగాలి