Nitish Kumar : నీతి ఆయోగ్ కు నితీష్ కుమార్ డుమ్మా
వరుసగా ప్రధాని మీటింగ్ కు రెండోసారి
Nitish Kumar : బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో దూరంగా ఉంటున్నారా. మరో వైపు ఇటీవల పాట్నాలో పర్యటించిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా మాత్రం తమ మధ్య ఎలాంటి దూరం లేదని స్పష్టం చేశారు.
అంతే కాకుండా రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు. కానీ సీన్ చూస్తే వేరేగా ఉంది.
ఇందుకు సంబంధించి నితీష్ కుమార్(Nitish Kumar) సాక్షాత్తు ప్రధాన మంత్రి నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాక పోవడం ఇది రెండోసారి.
ఇటీవల బీహార్ సీఎంకు కరోనా సోకింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నితీష్ కుమార్ తనకు బదులు డిప్యూటీని ఎవరినో ఒకరిని పంపించాలని అనుకున్నారు.
కానీ పీఎంఓ వర్గాలు మాత్రం కీలకమైన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేశారు. దీంతో సీఎం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.
గతంలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రి విందును ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్(Nitish Kumar) హాజరు కావాలని ఆహ్వానం పంపించారు. కానీ దానికి హాజరు కాలేదు సీఎం.
నెల రోజుల వ్యవధిలో రెండో సారి ప్రధాన నరేంద్ర దామోదర దాస్ మోదీ కార్యక్రమాలకు హాజరు కాక పోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఢిల్లీలో సోమవారం ఆగస్టు 8న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ నుంచి ప్రతినిధులు లేరని సమాచారం.
రాష్ట్ర అభివృద్ధి ర్యాంకింగ్స్ లో బీహార్ ను అట్టడుగున ఉంచిన నీతి ఆయోగ్ పై నితీష్ కుమార్ గుర్రుగా ఉన్నారని సమాచారం.
Also Read : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై సిసోడియా ఫైర్