Vinay Kumar Saxena : ఢిల్లీ స‌ర్కార్ కు షాకిచ్చిన ఎల్జీ స‌క్సేనా

ఎక్సైజ్ పాలసీ వైఫ‌ల్యం 11 ఆఫీస‌ర్ల‌పై వేటు

Vinay Kumar Saxena : ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా(Vinay Kumar Saxena)  దూకుడు పెంచారు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డం తోనే అర‌వింద్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఆప్ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. ఎల్జీ, సీఎంల మ‌ధ్య అగాధం పెరుగుతోంది.

మ‌రో వైపు కేంద్రం సాధ్య‌మైనంత మేర‌కు ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ ప్ర‌భుత్వాల మ‌ధ్య పంచాయ‌తీ సుప్రీంకోర్టులో న‌డుస్తోంది.

తాజాగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఎక్సైజ్ పాల‌సీని త‌ప్పు ప‌ట్టారు. ఫైల్ ను ఆమోదించ‌కుండా కొర్రీ విధించారు. 2021-22 మ‌ద్యం పాల‌సీని అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యారంటూ అధికారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఈ మేర‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌న పెన్ ప‌వ‌ర్ ఉప‌యోగించారు. వారిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. 11 మంది అధికారుల‌పై వేటు వేశారు.

వీరిలో ఢిల్లీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ అర‌వ్ గోపి కృష్ణ , డిప్యూటీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆనంద్ కుమార్ తివారి కూడా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది.

అంతే కాకుండా వీరితో పాటు ముగ్గురు అడ్ హ‌క్ ఆఫీస‌ర్లు, ఆరు మంది ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు విన‌య్ కుమార్ స‌క్సేనా.

టెండ‌ర్ల‌ను ఫైన‌లైజ్ చేయ‌డంలో, సంబంధిత వెండ‌ర్ల‌కు టెండ‌ర్ బెనిఫిట్ల‌ను చేర వేయ‌డంలో ఫెయిల్ అయ్యారంటూ చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఈ మేర‌కు వీరిపై చ‌ర్య తీసుకున్న విష‌యాన్ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆఫీసు స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కేవ‌లం 48 గంట‌ల్లోనే ఫైల్ త‌మ‌కు పంపించి ఫైన‌ల్ చేయ‌మ‌న్నారంటూ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించారు.

ప్ర‌స్తుత ఎల్జీదే త‌ప్పంటూ నిప్పులు చెరిగారు.

Also Read : ప‌ని చేస్తే ఓకే లేక పోతే తొల‌గింపే

Leave A Reply

Your Email Id will not be published!