Niti Aayog : నీతి ఆయోగ్ మీటింగ్ కు నితీష్..కేసీఆర్ డుమ్మా
సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలు
Niti Aayog : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ఆదివారం ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఆరోగ్య కారణాల రీత్యా హాజరు కాలేక పోతున్నట్లు తెలిపారు.
అయితే నితీష్ హాజరు కాక పోవడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ప్రధాన మంత్రి మోదీ స్వయంగా విందుకు రావాలని ఆహ్వానించారు. కానీ డోంట్ కేర్ అన్నారు.
అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమత్ చంద్ర షా మాత్రం సీఎం నితీష్ తో సత్ సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. ఆపై త్వరలో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు.
కానీ ఇవాళ జరిగిన ప్రత్యేక మీటింగ్ కు మాత్రం హాజరు కాలేదు. ఇంకో వైపు ఇటీవల కేంద్రంపై ప్రత్యేకించి మోదీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
ఆయన స్వయంగా ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తాను నీతి ఆయోగ్(Niti Aayog) ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీతి ఆయగ్ బక్వాస్ అని పేర్కొన్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు.
ఆపై ప్రధాని మోదీని భజన చేసేందుకు మాత్రమే నీతి ఆయోగ్ ఉందన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి నరేంద్ర మోదీతో పాటు మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
Also Read : దేశ నిర్మాణం కోసం దేశభక్తి అవసరం