PM Modi : రాజ్యసభకు వన్నె తెచ్చిన వెంకయ్య
ఉప రాష్ట్రపతిని ప్రశంసించిన మోదీ
PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడి పనితీరు, వ్యక్తత్వం గురించి ప్రస్తావించారు.
రాజ్యసభలో సోమవారం నరేంద్ర మోదీ వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉప రాష్ట్రపతి పదవితో పాటు రాజ్యసభ చైర్మన్ గా అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు. పరిణతి కలిగిన రాజకీయ నాయకులలో వెంకయ్య నాయుడు ఒకరని పేర్కొన్నారు.
ఆయనకు పలు భాషలపై మంచి పట్టుందని ప్రశంసించారు. ఏదైనా నేర్చు కోవడానికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. సభను నడిపించడంలో తనదైన ముద్ర కనబర్చారని కొనియాడారు ప్రధాన మంత్రి(PM Modi).
ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు పదవులు పొందిన సమయంలో. కానీ వెంకయ్య నాయుడు చేపట్టిన పదవులకు సంపూర్ణంగా న్యాయం చేశారని అన్నారు. అంతకు ముందు ఉప రాష్ట్రపతిని ప్రత్యేకంగా సన్మానించారు ప్రధాన మంత్రి.
రాజకీయాలలో ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
వాటిని సరిదిద్దడం, పరిష్కరించడం అనేది కత్తి మీద సాములాంటిదని దానిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించడంలో వెంకయ్య నాయుడు సక్సెస్ అయ్యారని నరేంద్ర మోదీ చెప్పారు.
రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య నాయుడు సజావుగా జరిగేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో గీత దాటిన వారిపై కూడా ఆయన వేటు వేసేందుకు వెనుకాడ లేదన్నారు.
వెంకయ్యకు భారతీయ భాషల మీద అభిరుచి కలిగి ఉండడం అభినందనీయమన్నారు.
Also Read : మరాఠా కేబినెట్ కు ముహూర్తం