Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజీనామా ఆమోదం
ఇక ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్దం
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తన ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పాడు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించారు.
స్పీకర్ వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇక ఉప ఎన్నిక అనివార్యం కానుంది. కనీసం మూడు నెలల పాటు సమయం పట్టనుంది.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) అన్నదమ్ములకు మంచి పట్టుంది. ఇదిలా ఉండగా ఇవాళే స్పీకర్ కార్యాలయం వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి విషయాన్ని సమాచారం ఇవ్వనుంది.
తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంతో పాటు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) ఈనెల 21న అమిత్ చంద్ర షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.
అదే రోజు మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించే చాన్స్ ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగనుంది.
కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో పట్టు కలిగిన టీఆర్ఎస్ ఇక్కడ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందోనేది వేచి చూడాలి.
Also Read : రామాయణ క్విజ్ లో ముస్లిం విద్యార్థుల సత్తా