Sanjay Raut : 22 వరకు సంజయ్ రౌత్ కస్టడీకి
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్
Sanjay Raut : మనీ లాండరింగ్ కేసులో శివసేనకు చెందిన సంజయ్ రౌత్(Sanjay Raut( ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి శివసేన చీఫ్ కోర్టుకు తరలించారు.
పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో 60 ఏళ్ల శివ సేన నేతను వారం రోజుల కిందట ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు రెండుసార్లు విచారణ సమన్లను రౌత్ పట్టించు కోలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా రాష్ట్రంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలి పోయిన కొద్ది వారాలకే ఆయన అరెస్ట్ శివసేనకు పెద్ద షాక్ గా మారింది.
పార్టీ గుర్తుపై యుద్దంలో టీమ్ షిండేతో టీమ్ ఉద్దవ్ ప్రతిష్టంభనలో చిక్కుకున్న సమయంలో రౌత్ అరెస్ట్ జరిగింది. శనివారం రౌత్ భార్య వర్షా రౌత్ ఈడీ విచారణలో చేరింది.
ఆమె తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ముంబై లోని బల్లార్డ్ ఎస్టేట్ లోని దర్యాప్తు సంస్థ అధికారుల ముందు హాజరయ్యారు. రౌత్ ను దర్యాప్తు సంస్థ జూలై 31న అరెస్ట్ చేసింది.
అంతకు ముందు ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ద్వారా ఆగస్టు 8 వరకు ఈడీ కస్టడీకి పంపించారు. సోమవారం మరోసారి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చడంతో కస్టడీని పొడిగించారు.
సంజయ్ రౌత్ ను ఆగస్టు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాగా అతడిని అరెస్ట్ చేసిన రోజున సోదా సమయంలో ఇంటి నుంచి రూ. 10 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
ఆ డబ్బు పార్టీకి చెందినందని ఆయన సోదరుడు సునీల్ రౌత్ తెలిపారు.
Also Read : అవినీతికి బీజేపీ కేరాఫ్ – కేజ్రీవాల్