Venkaiah Naidu : వెంకయ్య నాయుడు భావోద్వేగం
ప్రజా జీవితంలో ఎల్లప్పటికీ ఉంటా
Venkaiah Naidu : ఉప రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న సందర్భంగా రాజ్యసభలో సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు వెంకయ్య నాయుడు. తాను పదవి నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నానని కానీ ప్రజా జీవితం నుంచి కాదని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన విలువైన సూచనలు చేశారు. ఇదే సమయంలో వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) భావోద్వేగానికి గురయ్యారు. కొద్ది సేపు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాను ఎలా ఈ స్థాయికి వచ్చాననే దాని గురించి ప్రస్తావించారు. ప్రధాన మంత్రి మోదీ వచ్చి మిమ్మల్ని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నామని చెప్పారని, ఆ సమయంలో కన్నీళ్లు వచ్చాయన్నారు.
తాను అడగకుండానే పార్టీ తనకు ప్రయారిటీ ఇచ్చిందన్నారు. కానీ ఆరోజు చాలా బాధ పడ్డానని అన్నారు. ఎందుకోసం అంటే పార్టీని వీడుతున్నందుకని అన్నారు.
తట్టుకోలేక మనస్సు ఒప్పుకోలేక పార్టీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులకు కొన్ని విలువైన సూచనలు చేశారు.
సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన పార్లమెంట్ వ్యవస్థ భారత దేశంలో ఉందన్నారు. ఎందరో మహానుభావులు ఇక్కడ కొలువు తీరారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య గౌరవం పెంపొందించేలా నడుచు కోవాలని స్పష్టం చేశారు. అంతే కాకుండా సభలో మాట్లాడే (మాతృ) భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు వెంకయ్య నాయుడు.
తాను ఉప రాష్ట్రపతిగా కొలువు తీరాక మాతృభాషలో మాట్లాడటాన్ని ప్రోత్సహించానని చెప్పారు. సభలో ఎవరూ శత్రువులు ఉండరని కానీ ప్రత్యర్థులు ఉంటారన్నారు.
Also Read : మేరునగధీరుడు వెంకయ్య నాయుడు