PM Narendra Modi : మోదీ ఆస్తుల విలువ రూ. 2.23 కోట్లు
చరాస్తులు క్రితం కంటే రూ. 26.13 లక్షలు
PM Narendra Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆస్తులు పెరిగాయి. రూ. 26.13 లక్షల నుండి రూ. 2.23 కోట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి భూమిని విరాళంగా ఇచ్చారు.
కాగా మార్చి 31, 2021 నాటికి రూ. 1.1 కోట్ల విలువైన స్థిరాస్థులు ఆయన వద్ద లేవు. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తాజా నివేదికలో పేర్కొంది.
కాగా గాంధీ నగర్ లోని కొంత భూమిలో తన వాటాను విరాళంగా ఇచ్చినందున స్థిరమైన ఆస్తులు లేవని తెలిపింది. గత ఏడాది మార్చి 31 వరకు అప్ డేట్ చేయబడిన డిక్లరేషన్ ప్రకారం ఎటువంటి బాండ్ , షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి లేదు.
ఏ వాహనం స్వంతంగా లేదు మోదీకి(PM Narendra Modi) . కాగా రూ. 1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. మోదీ చరాస్తులు ఏడాది క్రితం కంటే రూ. 26.13 లక్షలు పెరిగాయి.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన వివరాల ప్రకారం మార్చి 31 , 2022 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్(PM Modi) ఆస్తుల మొత్తం విలువ రూ. 2,23,82,504 కోట్లు.
ఇక మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికీ సమాన వాటా ఉన్న మరో ముగ్గురు యజమానులతో కలిసి ఉమ్మడిగా ఉన్న
రెసిడెన్షియల్ ప్లాట్ ని అక్టోబర్ 2002లో కొనుగోలు చేశారు.
స్థిరాస్థుల సర్వే నెంబర్ 401/A మరో ముగ్గురు జాయింట్ ఓనర్లతో సంయుక్తంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ 25 శాతం సమాన వాటా ఉంటుంది.
అదే విరాళంగా ఇచ్చారని తెలిపింది పీఎంఓ. ఇక మార్చి 31,2022 నాటికి ప్రధాన మంత్రి చేతిలో ఉన్న నగదు రూ. 35,250. పోస్టాఫీసులో
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ల విలువ రూ. 9,05,105, జీవిత బీమా పాలసీ రూ. 1,89,305 కలిగి ఉన్నారు.
ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్ద మార్చి 31, 2022 నాటికి రూ. 2.54 కోట్ల విలువైన చరాస్తులు , రూ. 2.97 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
Also Read : సంజయ్ రాథోడ్ పై చిత్ర కిషోర్ వాగ్ ఫైర్