Nitish Kumar : లాలూ..రబ్రీజీ నన్ను మన్నించండి – నితీశ్
చాలా కాలం తర్వాత కలిసిన కత్తులు
Nitish Kumar : బీహార్ లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారి పోయాయి. 17 సంవత్సరాలుగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ , భారతీయ జనతా పార్టీ జాతీయ సంకీర్ణంలో స్థిరమైన భాగస్వాములుగా ఉన్నారు.
కానీ బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా తన పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారని గుర్తించారు నితీశ్ కుమార్. వెంటనే బీజేపీకి గుడ్ బై చెప్పారు.
తన చిరకాల మిత్రుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో బంధాన్ని తిరిగి తెరిచాడు. ఇక నితీశ్ కుమార్ (Nitish Kumar) స్వయంగా లాలూజీ ఇంటికి వెళ్లారు. మాఫ్ కిజియేగా అని లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు.
ఇఫ్తార్ పార్టీ కోసం నితీశ్ కుమార్ తేజస్వి యాదవ్ ఇంటికి వెళ్లారు. బీహార్ సీఎంగా ఆయన ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2015 నుండి తన మిత్రపక్షాలను రీ సైకిల్ చేశాడు.
ఆర్జేడీ తో పాటు కాంగ్రెస్, సీపీఐఎంఎల్, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పాటయ్యారు. నాలుగు చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ కూటమి ప్రజలకు సేవ చేస్తుందని, అవినీతిపై పోరాడుతుందని అన్నారు నితీశ్ కుమార్ మీడియాతో.
నితీశ్ కుమార్ కంటే 39 ఏళ్లు చిన్నోడు తేజస్వి యాదవ్. ఆయన డిప్యూటీ సీఎంగా కొలువు తీరనున్నాడు. ఎప్పటి లాగే తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ఇది దోహద పడనుంది.
పడుతూ లేస్తూ కొనసాగింది బీజేపీతో బంధం. చివరకు 2022లో గుడ్ బై చెప్పేలా చేసింది. పీఎం విందుకు పిలిచినా వెళ్లలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు.
మొత్తంగా నితీశ్ కుమార్ పదవి కాపాడు కునేందుకు ఎంతకైనా తెగిస్తారని స్పష్టమైంది.
Also Read : బీహార్ లో కొలువు తీరనున్న సంకీర్ణ సర్కార్