CM KCR : కేంద్రంపై యుద్దం త‌ప్ప‌దు స‌మ‌రం

స‌మీక్షా స‌మావేశంలో సీఎం కేసీఆర్

CM KCR : మ‌రోసారి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రాన్ని ల‌క్ష్యంగా చేసుకోవ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ప‌రిగ‌ణించారు. పాల‌నా ప‌రంగా దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన తెలంగాణ‌ను విప‌క్షాలు ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పించ‌డాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు.

ప్ర‌జ‌ల్లో మ‌రింత గంద‌రగోళం సృష్టించి ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నాయ‌ని దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్ శివారు ప్రాంతాల‌లో కాలుష్య కారక ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌ర‌లించాల‌ని, దాని వ‌ల్ల 5 వేల ఎక‌రాలు అందుబాటు లోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

వీటిని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR) . కొత్త‌గా 10 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు ఇవ్వాల‌న్నారు. అంతే కాకుండా 5 వేల 111 అంగ‌న్ వాడీ పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

సీఎం అధ్య‌క్ష‌త‌న 5 గంట‌ల‌కు పైగా కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు కేసీఆర్. కేంద్రం కావాల‌ని రాష్ట్రాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

క్షేత్ర స్థాయిలో ఆ పార్టీని ఎండ‌గట్టాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ‌న‌రులు పెంపొందించేందుకు ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌న్నారు.

విప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కు ఆధారాల‌తో స‌హా ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మాధానం చెప్పాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్(CM KCR) .

ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా మునుగోడు ఉప ఎన్నిక‌పై చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దాని గురించి ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ట్లు టాక్.

Also Read : 28న ఢిల్లీలో కాంగ్రెస్ ‘బోలో చ‌లో ఢిల్లీ’

Leave A Reply

Your Email Id will not be published!