Shashi Tharoor Award : శశి థరూర్ కు అరుదైన గౌరవం
ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
Shashi Tharoor Award : కేరళకు చెందిన శశి థరూర్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. మోస్ట్ పాపులర్ పొలిటిషియన్. అంతే కాదు మంచి వక్త. అద్భుతమైన రచయిత.
భారత దేశంలో అత్యున్నతమైన, ఎన్నదగిన రచయితలలో ఒకరుగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు.
తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా ప్రకటించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యేకించి ఆంగ్ల భాషపై అద్భుతమైన పట్టు కలిగిన కొద్ది మంది భారతీయులలో శశి థరూర్ ఒకరు. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న ఆయనకు అరుగైన గౌరవం లభించింది.
ఫ్రాన్స్ దేశం ప్రతి ఏటా ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారం కెవలియన్ డీ లా జీజియన్ డీహూనర్ ను అందుకోనున్నారు. శశి థరూర్(Shashi Tharoor Award) రాసిన రచనలు, ప్రసంగాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసింది ఆ దేశ ప్రభుత్వం.
ఈ మేరకు పౌర పురస్కారం ఎంపిక చేసిన విషయం గురించి ఫ్రాన్స్ రాయబారి ఎమ్మానుయేల్ లెనాయిన్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఎంపీ శశి థరూర్ కు తెలియ చేశారు.
ఎంపీ శశి థరూర్ కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా కెవలియర్ డీ లా లీజియన్ డీ హూనర్ అవార్డును నెపోలియన్ బొనా పార్టే 1802లో ఏర్పాటు చేశారు.
పౌర, సైనిక రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తూ వస్తోంది. కాగా గతంలో రాజ్యసభ ఎంపీ శశి థరూర్ ఐక్య రాజ్య సమితిలో అండర్ సెక్రటరీ జనరల్ గా పని చేశారు.
Also Read : ఉప రాష్ట్రపతిగా కొలువు తీరిన ధన్ ఖర్