Tejashwi Yadav : సోనియాతో భేటీ కానున్న తేజస్వి యాదవ్
బీహార్ లో డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు
Tejashwi Yadav : బీహార్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆకస్మికంగా మారి పోయాయి. ఉన్నట్టుండి జేడీయూ , భారతీయ జనతా పార్టీ మధ్య నెలకొన్న 17 ఏళ్ల సంబంధం తెగి పోయింది.
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ , సీపీఐఎంఎల్, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిని ఏర్పాటు చేశారు. సీఎంగా నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ కొలువు తీరారు.
ఇక మహాఘట బంధన్ ప్రభుత్వం బలపరీక్షకు నిలబడనుంది. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు.
జేడీయూని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందంటూ సీఎం నితీశ్ కుమార్ సోనియాకు విన్నవించారు. దీనికి మద్దతు ఇచ్చేందుకు సమ్మతించారు సోనియా గాంధీ.
ఈ మహా కూటమి ఏర్పాటు కావడానికి ఆమె కీలక పాత్ర పోషించారు. స్వయంగా సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేశారు. సోనియా గాంధీ ఓకే చెప్పారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీతో మాట్లాడమని సూచించారు.
ఆ పనిని నితీశ్ కుమార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు అప్పగించారు. దీంతో డిప్యూటీ సీఎం మేడంతో కీలక భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి లోపు ఆయన సోనియా గాంధీతో సమావేశం కానున్నట్లు సమాచారం.
ఇదే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ఇదిలా ఉండగా కొత్తగా కొలువు తీరిన మహాఘటబంధన్ లో కీలక భాగస్వామిగా ఉంది కాంగ్రెస్ పార్టీ.
ఇందులో భాగంగా కీలక అంశాల గురించి చర్చించనున్నారు తేజస్వి యాదవ్.
Also Read : ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదు – నితీశ్