Youtube Plans : యూట్యూబ్ స్ట్రీమింగ్ వీడియో స‌ర్వీస్

త్వ‌ర‌లో లాంచ్ చేయ‌నున్న దిగ్గ‌జ సంస్థ

Youtube Plans : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇదే సంస్థ‌కు చెందిన యూట్యూబ్(Youtube) ఆస‌క్తిక‌ర‌మైన ఫీచ‌ర్ కు తెర తీసింది. ఈ మేర‌కు యూట్యూబ్ స్ట్రీమింగ్ వీడియో స‌ర్వీస్ ను ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీల‌తో చ‌ర్చిస్తోంది. స్ట్రీమింగ్ వీడియో సేవ‌ల కోసం ఆల్ఫా బెట్ ఇంక్ కు చెందిన యూట్యూబ్ ఆన్ లైన్ స్టోర్ ను ప్రారంభించ‌నుంది.

ఈ విష‌యాన్ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. స‌ద‌రు కంపెనీ చ‌ర్చ‌ల‌ను పున‌రుద్ద‌రించింది. ఇది అంత‌ర్గ‌తంగా ఛాన‌ల్ స్టోర్ గా ప్ర‌స్తావిస్తోంది.

ఇదే ప్లాట్ ఫార‌మ్ పై 18 నెల‌లుగా ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది గూగుల్. యూట్యూబ్ గూగుల్ లో ఒక భాగంగా ఉంది. వీడియో స్ట్రీమింగ్ లో భాగంగా ఆండ్రాయిడ్ 13 మీడియా నోటిఫికేష‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తుంది.

గూగుల్ మీట్ అనేది లైవ్ షేరింగ్ ఫీచ‌ర్ వినియోగ‌దారుల‌ను కంటెంట్ తో అనుసంధానం చేసేలా చేస్తుంది. గేమ్ లు (ఆట‌లు) ఆడేందుకు వీలు క‌లుగుతుంది.

ఎక్కువ మంది వినియోగదారులు కేబుల్ లేదా శాటిలైట్ టీవీలో అతుక్కుని ఉండి పోయారు కోట్లాది మంది. ఇవి లేకుండానే స‌బ్ స్క్రిప్ష‌న్ – ఆధారిత స్ట్రీమింగ్ సేవ‌ల‌కు మారింది ప్ర‌స్తుత టెక్నాల‌జీ.

ఇప్ప‌టికే ర‌ద్దీగా ఉన్న స్ట్రీమింగ్ మార్కెట్ లో కొంత భాగాన్ని పొందే ప్ర‌య‌త్నంలో యూట్యూబ్ ఇంక్ , ఆపిల్ వంటి కంపెనీల‌లో చేరేందుకు ప్రణాళిక‌బ‌ద్ద‌మైన ప్రారంభానికి ప‌ర్మిష‌న్ ఇస్తుంది.

కాగా ఈ వార్త‌ల‌పై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు గూగుల్.

Also Read : రుణ రిక‌వ‌రీ ఏజెంట్ల‌కు ఆర్బీఐ షాక్

Leave A Reply

Your Email Id will not be published!