Nara Lokesh Assets : నారా లోకేష్ ఆస్తులు రూ. 369 కోట్లు

రూ. 101 కోట్ల‌తో ఎమ్మెల్సీ వాకాటి

Nara Lokesh Assets : ఏపీ రాష్ట్రం ఓ వైపు అప్పుల్లో కూరుకు పోతుంటే రాజ‌కీయ నాయ‌కుల ఆస్తులు మాత్రం అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో సంపాదించ‌డం, ఆస్తులు కూడ బెట్టుకోవ‌డం అన్న‌ది ప‌రిపాటిగా మారింది.

అప్పుల‌తోనే అభివృద్ది అన్న టీడీపీ చంద్ర బాబు నాయుడి నినాదం మాటేమిటో కానీ త‌న త‌న‌యుడు ఎమ్మెల్సీ నార లోకేష్ ఆస్తులు చూస్తే దిమ్మ తిరిగేలా ఉంది.

విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో మొత్తం శాస‌న మండ‌లి స‌భ్యుల‌లో 75 శాతానికి పైగా కోటీశ్వ‌రులుగా ఉండ‌డం విశేషం. ఇదే విష‌యాన్ని ఏ వైఎస్సార్సీపీ లేదా బీజేపీనో వెల్ల‌డించ‌లేదు.

ప్ర‌తి ఏటా దేశంలో రాజ‌కీయ నాయ‌కుల ఆస్తుల బండారాన్ని నిక్క‌చ్చిగా బ‌ట్ట బ‌య‌లు చేస్తూ వ‌స్తోంది అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఏపీ ఎల‌క్ష‌న్ వాచ్ . తాజాగా వీరి ఆస్తుల చిట్టాను వెల్ల‌డించింది.

ఎన్నిక‌ల కంటే ముందు పోటీ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు త‌మ నిక‌ర‌, చ‌రాస్థుల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఇక బినామీల పేర్ల మీద ఎన్ని ఆస్తులున్నాయో ఎవ‌రూ చెప్ప‌లేరు.

ఇక ఏపీలోని 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలలో 48 మంది వివ‌రాల‌ను వెల్ల‌డించింది. వీరిలో 36 మంది కోటీశ్వ‌రులుగా తేలింది. నారా లోకేష్ కు రూ. 369 కోట్ల‌కు పైగా ఆస్తులు(Nara Lokesh Assets)  ఉన్న‌ట్లు తేల్చింది.

రెండో స్థానంలో రూ. 101 కోట్ల‌తో ఎమ్మెల్సీ వాకాటి నిలిచారు. మూడో స్థానంలో రూ 36 కోట్లతో మాధ‌వ‌రావు ఉన్నారు. 20 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు తేల్చింది.

అత్య‌ల్పంగా ఇ. ర‌ఘువ‌ర్మ అతి త‌క్కువ ఆస్తి క‌లిగి ఉన్నారు. రూ. 1,84, 527 మాత్ర‌మే.

Also Read : రుణ రిక‌వ‌రీ ఏజెంట్ల‌కు ఆర్బీఐ షాక్

Leave A Reply

Your Email Id will not be published!