Bhagwant Mann : ఒక ఎమ్మెల్యే ఒక పెన్ష‌న్ చారిత్రాత్మ‌కం

పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ ప్ర‌క‌ట‌న‌

Bhagwant Mann : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఒక ఎమ్మెల్యేకు ఒక పెన్ష‌న్ మాత్ర‌మే ఉండేలా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఒక ఎమ్మెల్యే ఒక పెన్ష‌న్ అమ‌లు నోటిఫికేష‌న్ దేశ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో ఓ సంచ‌ల‌న‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఇది పెను మార్పుల‌కు దోహ‌దం చేస్తుంద‌న్నారు. గ‌తంలో ఎన్నికైన వారంతా ప‌లు పెన్ష‌న్లు తీసుకుంటున్నారంటూ తెలిపారు. దీని వ‌ల్ల పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాకు పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లుతోంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌భుత్వానికి రూ. 19.53 కోట్లు ఆదా అవుతుంద‌ని వెల్ల‌డించారు. గ‌తంలో పాల‌కులు ఒక్కో ఎమ్మెల్యే రెండు మూడు పెన్ష‌న్లు తీసుకుంటున్నార‌ని, ఈ విష‌యం తాము పాల‌న‌లోకి వ‌చ్చాక గ‌మ‌నించామ‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న వారు ఇలా చేస్తే పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మాజీ ఎమ్మెల్యేల‌కు బ‌హుళ (రెండు లేదా మూడు ) పెన్ష‌న్ల‌ను ప‌రిమితం చేసే బిల్లుకు పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) . ఈ పెన్ష‌న్ల‌ను త‌గ్గిస్తే క‌నీసం రాష్ట్ర ఖ‌జానాకు మొత్తంగా రూ. 100 కోట్లు మిగులుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌న స్వాతంత్ర స‌మ‌ర యోధులు, జాతీయ వీరుల క‌ల‌ల‌ను సాకారం చేసేందుకు ఆప్ స‌ర్కార్ చేప‌ట్టిన ఒక విన‌య పూర్వ‌క‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు సీఎం.

Also Read : క‌ల‌వ‌ర పెడుతున్న క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!