BJP Targets : బీజేపీ నెహ్రూ వీడియోపై కాంగ్రెస్ కన్నెర్ర
స్వాతంత్ర దినోత్సవ వేళ పార్టీ ఆగ్రహం
BJP Targets : ఇవాళ భారత దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతోంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన భావజాలాన్ని, తన సిద్దాంతాన్ని ప్రజలపై, దేశంపై రుద్దాలని చూస్తూ వస్తోంది.
ఇప్పటికే బీజేపీ ఒకే దేశం..ఒకే మతం..ఒకే భాష..ఒకే పార్టీ ఉండాలన్న సంకల్పంతో చాప కింద నీరులా జనాన్ని రెచ్చగొడుతోంది. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కు చెందిన నాథూరామ్ గాడ్సే జాతిపిత మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చి చంపాడు.
యావత్ ప్రపంచం గాంధీని ఆదర్శంగా తీసుకుంటోంది. శాంతి మార్గాన్ని చూపిన అరుదైన నాయకుడిగా కీర్తిస్తూ వస్తోంది. కానీ బీజేపీ మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తోంది.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద ఏటా ఇచ్చే రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు సంబంధించి రాజీవ్ పేరును మార్చేసింది. ఆయన స్థానంలో హాకీ వీరుడు ధ్యాన్ చంద్ ను చేర్చింది.
ఇక ఒకప్పుడు దేశం పేరు చెబితే అమర వీరులు, స్వాతంత్ర సమర యోధులు గుర్తుకు వచ్చే వారు. కానీ ఇప్పుడు దేశాన్ని కాషాయ మయంగా చేస్తూ కేవలం మోదీ మాత్రమే దేశానికి దిక్కు అంటూ ప్రచారం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ పై విషం కక్కుతూ దేశ విభజనకు ప్రధాన కారకుడు జవహర్ లాల్ నెహ్రూ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది భారతీయ జనతాపార్టీ(BJP Targets). 1947 లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను చూపించారు.
పాకిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్ కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. ఈ వీడియోపై తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : జెండాలు ఎగరేస్తే దేశభక్తులు కాలేరు