PM Modi : సైనికుల‌కు వంద‌నం వీరుల‌కు సలాం

దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల‌కు స‌లాం చేస్తున్నా. రేయింబ‌వ‌ళ్లు దేశ ర‌క్ష‌ణ కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న జ‌వాన్లు, సైనికుల‌కు అభివంద‌నం చేస్తున్నానని అన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).

భారత దేశానికి స్వాతంత్రం వ‌చ్చి నేటికి 75 ఏళ్ల‌వుతోంది. ప్ర‌ధాని నేతృత్వంలో వేడుక‌లు జ‌రిగాయి. న‌రేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఎర్ర‌కోట‌పై జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ దేశం స్వేచ్ఛ‌గా ఉండేందుకు కార‌ణం సైనికులేన‌ని కొనియాడారు. వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగ‌ల‌మ‌న్నారు ప్ర‌ధాన మంత్రి. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాల‌ర్పించిన బాపు, చంద్ర‌బోస్ , అంబేద్క‌ర్ , వీర సావ‌ర్క‌ర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు.

ఆనాడు ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఏర్పాటు చేసి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేసిన ఘ‌న‌త చంద్ర‌బోస్ కు ద‌క్కుతుంద‌న్నారు.

దేశం కోసం త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన భ‌గ‌త్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ గురుల‌కు ఈ సంద‌ర్బంగా ప్ర‌ణ‌మిల్లుతున్నాన‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు జై జ‌వాన్ జై కిసాన్ దేశానికి ఆద‌ర్శ‌నీయ‌మ‌న్నారు.

ఈ దేశం ఎల్ల‌ప్ప‌టికీ సైనికుల‌కు, జ‌వాన్ల‌కు రుణ‌ప‌డి ఉంటుంద‌ని న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. డిజిట‌ల్ ఇండియా ప్ర‌పంచంలో టాప్ లో ఉంద‌న్నారు. టెక్నాల‌జీ ప‌రంగా దూసుకు వెళుతోంద‌న్నారు మోదీ.

ఈ దేశం మేకిన్ ఇండియాగా త్వ‌ర‌లో అవుతుంద‌న్నారు. ఈ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

 

Also Read : 25 ఏళ్ల‌లో ప్రపంచంలో భార‌త్ టాప్

 

Leave A Reply

Your Email Id will not be published!