India Post Pin Code : పోస్టల్ సర్వీస్ పిన్ కోడ్ కు 50 ఏళ్లు
అరుదైన చరిత్ర సృష్టించిన పోస్టల్ శాఖ
India Post Pin Code : భారత దేశానికి స్వాతంత్రం వచ్చి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మజిలీలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అద్భుతమైన విజయాలు ఉన్నాయి. జాతి సేవలో రైళ్లు, పోస్టల్ శాఖ, ఆర్మీ విశిష్ట సేవలు అందించాయి.
ఇంకా అందజేస్తూ మన్ననలు అందుకుంటున్నాయి. తాజాగా భారత దేశానికి చెందిన భారత పోస్టాఫీస్(India Post Pin Code) అరుదైన చరిత్ర సృష్టించింది. పోస్టల్ సర్వీస్ కు సంబంధించిన పిన్ కోడ్ ఆవిర్భవించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
భారత దేశం అంతటా అనేక స్థలాలకు బట్వాడా చేసేందుకు ఈ పిన్ కోడ్ లను ఏర్పాటు చేశారు. ఉత్తరాలు, మనీ ఆర్డర్లు, పార్సిళ్లు ఆయా గ్రామీణ ప్రాంతాలకు చేర్చాలంటే , ఎలాంటి ఆలస్యం లేకుండా ఉండాలంటే పిన్ కోడ్ లు అవసరమని భావించింది పోస్టల్ శాఖ.
ఇదే భారత పోస్టల్ శాఖ ఆగస్టు 15, 1972న భారత దేశంలో మొట్ట మొదటి సారిగా ప్రారంభించింది. మరో ముఖ్యమైన మైలు రాయిని చేరుకుంది. ఉత్తరాలు, కొరియర్ లు, ఇతర పోస్టల్ వస్తువులను పంపేందుకు ఉయోగించే పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పిన్ ) నేటితో హాఫ్ సెంచరీ సాధించింది.
పిన్ కోడ్ లు ఆరు అంకెలు ఉంటాయి. వీటిన దేశంలోని పోస్టల్ సర్వీస్ నంబర్ సిస్టమ్ గా ఉపయోగిస్తారు. వాటిని ఏరియా కోడ్ లు లేదా జిల్లా కోడ్ లు అని కూడా పిలుస్తారు.
పోస్టల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పోస్ట్ మ్యాన్ కు ఒక లేఖ లేదా ప్యాకేజీని గుర్తించి , ఉద్దేశించిన గ్రహీతకు అందించడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
ఇదిలా ఉండగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేసిన పోస్ట్ లు, టెలిగ్రాఫ్ బోర్డులో సీనియర్ సభ్యునిగా పని చేసిన శ్రీరామ్ భికాజీ వేలంకర్ దేశంలో పిన్ కోడ్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు.
Also Read : నెహ్రూను విస్మరించడం దారుణం