Justice UU Lalit : పెండింగ్ కేసుల పరిష్కారంపై ఫోకస్
జాతీయ మీడియాతో జస్టిస్ యుయు లలిత్
Justice UU Lalit : లెక్కకు మించి దేశ న్యాయ వ్యవస్థలో కేసులు పేరుకు పోయాయి. ఇవాళ 76వ వసంతంలోకి అడుగు పెట్టాం. ఆగస్టు 26న దేశ అత్యున్నత పదవిలో ఉన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన స్థానంలో జస్టిస్ యుయు లలిత్ కొలువు తీరనున్నారు. ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ సీజేఐగా కేవలం 74 రోజుల పాటు మాత్రమే కొనసాగుతారు.
అంత వరకే ఆయన పదవీ కాలం ఉంది. ఇక జస్టిస్ లలిత్ తర్వాత డీవై చంద్రచూడ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరనున్నారు.
పంద్రాగస్టు సందర్భంగా కాబోయే సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. తన పదవీ కాలం తక్కువగా ఉన్నప్పటికీ తన ప్రాధాన్యతలు ఏమిటనేది స్పష్టంగా చెప్పారు.
ప్రధానంగా గుట్టలుగా పేరుకు పోయిన కేసులను పరిష్కరించడంపై ఫోకస్ పెడతానని స్పష్టం చేశారు. పరిమితమైన వనరులు ఉన్నాయి.
వీటి ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కొంత కసరత్తు చేయాలన్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను వ్యవహారాలపై ఎక్కువగా కేసులు వస్తున్నాయని వెల్లడించారు.
అవి ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదన్నారు జస్టిస్ లలిత్(Justice UU Lalit) . సుప్రీంకోర్టు విధి చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం. అలాంటి సందర్బాలు వచ్చినప్పుడు నిపుణులతో కూలంకుషంగా చర్చించాల్సి ఉంటుందన్నారు.
న్యాయ మూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపునకు తాను వ్యతిరేకమన్నారు జస్టిస్ లలిత్. పని ఒత్తిళ్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు.
Also Read : పోస్టల్ సర్వీస్ పిన్ కోడ్ కు 50 ఏళ్లు