China Troops Pak : పాక్ లో బలగాల మోహరింపుపై చైనా ఫోకస్
శ్రీలంక ఓడ రేవులో నిఘా నౌక మోహరింపు
China Troops Pak : డ్రాగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దాయాది దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్ లను అడ్డం పెట్టుకుని పట్టు సాధించాలని చూస్తోంది. ఇప్పటికే 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది లంక ఓడ రేవును.
అక్కడ తన నిఘా నౌకను మోహరించింది. ఇక పాకిస్తాన్ లోని ఔట్ పోస్టులలో తన భద్రతా బలగాలను మోహరించాలని చూస్తోంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఇప్పుడు కోలుకోలేని అప్పుల్లో కూరుకు పోయాయి.
ఎక్కువ శాతం ఈ రెండు దేశాలు చైనాపై ఆధారపడ్డాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా వివాద పీడిత పాకిస్తాన్ – ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది చైనా.
ప్రత్యేకంగా రూపొందించిన ఔట్ పోస్టులను టార్గెట్ చేసింది. అక్కడ తన స్వంత బలగాలను మోహరించేందుకు శ్రీకారం చుట్టింది. రెండు దేశాలలో తన ప్రయోజనాలను కాపాడు కోవాలని చూస్తోంది డ్రాగన్.
శ్రీలంక అప్పులు తలకు మించిన భారంగా మారాయి. ఇక పాకిస్తాన్ అంచనాల ప్రకారం 60 బిలియన్లకు పైగా పెరిగాయి చైనాతో(China Troops Pak). ఇక ఆ దేశం ఆర్థికంగానే కాకుండా సైనిక, దౌత్య పరమైన మద్దతు కోసం కూడా చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంది.
చైనా తన సాయుధ సిబ్బందిని నిలబెట్టే చోట అవుట్ పోస్టుల నిర్మాణాన్ని అనుమతించ బోమంటూ పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకు రావడం ప్రారంభించింది.
ఇదిలా ఉండగా చైనా రాయబారి నోంగ్ రాంగ్ ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , విదేశాంగ మంత్రి బులావర్ భుట్టో , ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాతో సమావేశం అయ్యారు.
Also Read : రష్యాతో ఆయిల్ కొనుగోలు కరెక్టే – జైశంకర్