Supreme Court : డోలో కంపెనీ నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
మందుల కంపెనీలు జవాబుదారీగా ఉండాలి
Supreme Court : కరోనా కష్ట కాలంలో మోస్ట్ పాపులర్ గా మారింది డోలో-650 ట్యాబెట్లు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వారి వరకు అంతా డోలో జపం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
బెంగళూరు కేంద్రంగా డోలో 650 కంపెనీ కొలువు తీరింది. మహమ్మారి కరోనా సమయంలో డోలో మందుల కంపెనీ పంట పండింది. ఏకంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించింది.
కానీ ఆదాయానికి సంబంధించి పన్ను కట్టకుండా ఉండి పోయింది. ఈ మొత్తం వ్యవహారంపై అనుమానం వచ్చింది ఆదాయ పన్ను శాఖకు.
ఈ మేరకు పెద్ద ఎత్తున పలు మందుల కంపెనీలపై దాడులు చేపట్టింది. విచిత్రం ఏమిటంటే డోలో 650 కంపెనీ దేశంలోని వైద్యులందరికీ రూ. 1,000 కోట్ల రూపాయలు బహుమతులు (తాయిలాలు)గా ఇచ్చిందని విచారణలో తేలింది.
కంపెనీ ఇచ్చిన వాటితో సంతృప్తి చెందిన వైద్యులంతా ప్రతి దానికీ డోలో 650(Dolo 650) ట్యాబ్లెట్ లనే వాడాలంటూ సిఫారసు చేయడం మొదలు పెట్టారు. దీంతో కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది.
ఈ మందుల తయారీదారులు కోట్ల రూపాయలను ఇతర వాటిలో పెట్టుబడి పెట్టారని గ్రహించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో(Supreme Court) కేసు విచారణకు వచ్చింది.
జస్టిస్ డీవై చంద్ర చూడ్ , జస్టిస ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం దీనిని తీవ్రమైన అంశంగా పేర్కొంది. వైద్యులకు మందులు రాసేందుకు ఇన్సెంటీవ్ లు ఇస్తున్న ఫార్మా కంపెనీలు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ , సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
Also Read : జన్మాష్టమి పుణ్య మార్గానికి ప్రేరణ