Delhi LT Governor : ప్రాజెక్టుల ఆలస్యంపై ఎల్జీ ఘాటు లేఖ
నవీన్ కుమార్ సక్సేనా వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్
Delhi LT Governor : రోజు రోజుకు ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్(Delhi LT Governor) నవీన్ కుమార్ సక్సేనాకు మధ్య ప్రచ్చన్న యుద్దం నడుస్తోంది. ఇప్పటికే కొర్రీలు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బహిరంగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా మరో వివాదానాకి తెర లేపారు ఎల్జీ సక్సేనా. ఆయన సీఎం కేజ్రీవాల్ కు ఘాటు లేఖ రాశారు. చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని వాటికి గల కారణాలు ఏంటో తనకు తెలియ చేయాలని పేర్కొన్నారు.
చెట్ల తొలగింపు అనుమతి పెండింగ్ లో ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులు ఆగి పోయాయి. నిబంధనల ప్రకారం చెట్ల తొలగింపు అనేది ఢిల్లీ ప్రభుత్వ అటవీ శాఖ 60 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
త్వరగా పర్మిషన్ అనేది ఇవ్వక పోవడం వల్ల సెంట్రల్ విస్టా, మెట్రో ఫేజ్ IV, రీజినల్ రాపిట్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్ ) , ద్వారకా ఎక్స్ ప్రెస్ వే వంటి వివిధ ముఖ్యమైన ప్రాజెక్టులలో జాప్యం జరుగుతోందంటూ మండిపడ్డారు.
ముందు వీటిని పరిష్కరించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా తాను ఒప్పుకోనని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే 60 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏడాది కావస్తున్నా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా నవీన్ కుమార్ సక్సేనా కొలువు తీరిన నాటి నుంచీ సీఎంకు పడడం లేదు. కేంద్రం తన పరిమితికి మించి తమపై జోక్యం చేసుకునేందుకు ఎల్జీని వాడుకుంటోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.
Also Read : 14 రోజుల కస్టడీకి పార్థా..అర్పితా ముఖర్జీ