Partha Arpita ED : 14 రోజుల కస్టడీకి పార్థా..అర్పితా ముఖర్జీ
ప్రశ్నించనున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
Partha Arpita ED : పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ, సహాయకురాలు అర్పితా ముఖర్జీకి(Partha Arpita ED) 14 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇప్పటికే వీరిద్దరినీ ఈడీ అదుపులోకి తీసుకుంది.
వారికి సంబంధించిన సోదాలలో పెద్ద ఎత్తున నగదు, బంగారం దొరికింది. అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో రూ. 50 కోట్లకు పైగా నగదు, 5 కేజీల కు పైగా బంగారం స్వాధీనం చేసుకుంది ఈడీ.
ఇందులో భాగంగా వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరు పర్చింది. ఈ మేరకు కస్టడీకి తీసుకుంది. ఇదిలా ఉండగా పార్థ చటర్జీ కోర్టుకు వెళ్లేటప్పుడు ఎవరికీ మినహాయింపు ఉండదంటూ పేర్కొన్నారు.
కాగా మాజీ మంత్రిని, సహాయకురాలు అర్పితాను వేర్వేరుగా ప్రశ్నించింది. వీరిద్దరినీ ఆగస్టు 31న మళ్లీ కోర్టులో హాజరు పర్చాల్సి ఉంటుందని కోల్ కతా లోని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.
అయితే త్వరలో నిజాలు ఏమిటో తేలుతాయని అన్నారు మాజీ మంత్రి. మరో వైపు ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సీఎం మమతా బెనర్జీకి నెంబర్ టూ గా వ్యవహరించారు.
కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కాం చోటు చేసుకుంది. ఆనాడు వసూలు చేసిన డబ్బులు , బంగారం అర్పిత ముఖర్జీ ఇళ్లలలో దాచి ఉంచారని ప్రచారం జరిగింది.
దీంతో పార్టీ నుండి, మంత్రి పదవి నుండి తొలగించింది సీఎం. కాగా పార్థ చటర్జీ తమ ప్రశ్నలకు సరిగా స్పందించడం లేదంటూ ఈడీ ఆరోపించింది.
అయితే ఆయన తరపు న్యాయవాది మాత్రం ఆరోగ్యం సరిగా లేదని, నడిచేందుకు రావడం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Also Read : బిల్కిస్ బానో దోషులను వెనక్కి తీసుకోవాలి