Mumtaz Patel : ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం – ముంతాజ్
స్పష్టం చేసిన అహ్మద్ పటేల్ కూతురు
Mumtaz Patel : కాంగ్రెస్ దివంగత నాయకుడు అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మొదటగా తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం లేదంటూ పేర్కొంది.
ఆ తర్వాత వెంటనే మాటను మార్చేసింది. తాను పాలిటిక్స్ లోకి రావడానికి, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించింది.
గుజరాత్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ముంతాజ్ పటేల్(Mumtaz Patel) చేసిన ప్రకటన పార్టీలో కలకలం రేపింది. పార్టీ పరంగా కూడా ఆమె తన మనసులోని మాటను విప్పారు.
తాను ఎలాంటి హడావుడి చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు ముంతాజ్ పటేల్.
తాను ఇంకా తన తండ్రి పార్టీలో చేరలేదని స్పష్టం చేసింది. ప్రజలతో కలిసి పని చేసేందుకు రాజకీయాలు ఓ వేదికగా ఉపయోగ పడతాయని చెప్పారు.
తాను అధికారిక ప్రవేశం లేదా పాత్రను పోషించేందుకు సరైన స్థలం, సమయం కోసం వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. ఒక వేళ ప్రజలు భావిస్తే తాను
రావాలని కోరుకుంటే తప్పకుండా వస్తానని చెప్పారు ముంతాజ్ పటేల్.
ప్రాతినిధ్యం వహించేందుకు ఆలోచించే ప్రసక్తే లేదన్నారు. అయితే మా తండ్రి అహ్మద్ పటేల్ కొన్ని మంచి పనులు చేయాలని అనుకున్నారు.
నేను వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. బరూచ్ లోని నా కుటుంబం నుండి ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని చెప్పారు ముంతాజ్ పటేల్.
బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. మహిళలు, యువతలు కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read : సౌగతా రాయ్ ని కొట్టే రోజు వస్తుంది