Central Govt Ban : తెలంగాణ విద్యుత్ సంస్థకు బిగ్ షాక్
క్రయ విక్రయాలు జరిపేందుకు నో చాన్స్
Central Govt Ban : తెలంగాణ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం. విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఎనర్జీ ఎక్ఛేంజి నుంచి క్రయ విక్రయాలు జరపకుండా చర్యలు చేపట్టింది.
ఈ మేరకు అర్ధరాత్రి నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొంది. దీంతో విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని 13 రాష్ట్రాలకు కోలుకోని షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు తెలంగాణ విద్యుత్ సంస్థ ఇప్పటి దాకా బకాయిలు చెల్లించ లేదు. దాదాపు ఆ బకాయిలు రూ. 1,380 కోట్లు పేరుకు పోయాయి.
ఇదిలా ఉండగా ఇండియన్ ఎనర్జీ ఎక్ఛేంజ్ నుంచి ఆయా రాష్ట్రాలు తమకు కావాల్సిన విద్యుత్ కు సంబంధించి కొనుగోలు చేస్తుంటాయి. బకాయిలు చెల్లించలేదనే కారణంతో కేంద్రం నిషేధం(Central Govt Ban) విధించింది.
దీని వల్ల కరెంట్ కొనుగోలు చేయడం అన్నది వీలు కాదు. తెలంగాణతో పాటు ఏపీకి కూడా షాక్ ఇచ్చింది. మొత్తం 29 విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది.
పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఆ మేరకు ఇందుకు సంబంధించి సమాచారం అందించింది. ఇక తెలంగాణలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ. 197.67 కోట్లు , తెలంగాణ స్టేట్ కోఆర్డినేషన్ రూ. 1, 078 కోట్లు బకాయిలు ఉన్నాయి.
వీటిని చెల్లించడం లేదు రాష్ట్ర విద్యుత్ సంస్థ. ఇదిలా ఉండగా తాము కోర్టుకు వెళతామంటున్నారు సీఎండీ ప్రభాకర్ రావు.
Also Read : ప్రాజెక్టుల ఆలస్యంపై ఎల్జీ ఘాటు లేఖ