Rajnath Singh : నాన్న మరణంతో ఆర్మీలో చేరలేదు
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న ఆయన ఏకంగా తనకు ఈ వయస్సులో ఆర్మీలో చేరాలని ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇంఫాల్ లో అస్సాం రైఫిల్స్ , ఇండియన్ ఆర్మీ 57వ మౌంటైన్ డివిజన్ సిబ్బందిని ఉద్దేశించి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ప్రసంగించారు. తాను బలగాల్లోకి రావడానికి పరీక్షకు ఎలా హాజరయ్యాడనే దానిపై వివరించాడు కేంద్ర మంత్రి.
తాను ఆర్మీలో చేరాలని అనుకుంటున్నానని, పరీక్ష కూడా రాశానని చెప్పారు. కానీ చేరేందుకు కుదర లేదని చెప్పారు రాజ్ నాథ్ సింగ్.
తనకు చిన్నప్పటి నుంచే భారత సైన్యంలో చేరాలని ఆశగా ఉండేదని , కానీ తన కుటుంబంలో నెలకొన్న ఇబ్బందుల వల్ల కుదరలేదని స్పష్టం చేశారు.
ఒకసారి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. కానీ మా నాన్న మరణంతో నేను సైన్యంలో చేరలేక పోయానని అన్నారు కేంద్ర మంత్రి. ఈ దేశంలో గొప్ప గౌరవం ఆర్మీకి ఉందన్నారు.
ఎందుకంటే మీరు ఒక పిల్లవాడికి ఆర్మీ యూనిఫాం వేసి చూడండి. అతడి వ్యక్తిత్వం పూర్తిగా మారి పోతుందని పేర్కొన్నారు. ఈ యూనిఫాంలో ఒక ఆకర్షణ ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్.
ఫుక్రీ లోని అస్సాం రైఫిల్స్ ఇన్స్ పెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి సైనికులతో సమావేశం అయ్యారు.
Also Read : బీజేపీ పంతం కేజ్రీవాల్ అంతం – చద్దా