Manish Sisodia : సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌ర్సెస్ ఆప్

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం సిసోడియా

Manish Sisodia : ఎక్సైజ్ పాల‌సీకి సంబంధించి సీబీఐ సోదాలు చేసిన అనంత‌రం ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో 2024లో దేశ వ్యాప్తంగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ బీజేపీ, ఆప్ మ‌ధ్యే ఉండబోతుంద‌న్నారు.

ఎక్సైజ్ మోసం గురించి బీజేపీ ఆందోళ‌న చెంద‌డం లేద‌న్నారు. వారి భ‌యం, ఆందోళ‌న అంతా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ గురించేన‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి (PM Modi) అస‌లైన పోటీదారుగా, స‌వాల్ గా అర‌వింద్ కేజ్రీవాల్ మారార‌ని అందుకే త‌మ‌ను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.

కేంద్ర ప్ర‌భుత్వం కావాల‌నే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోదంంటూ మండిప‌డ్డారు మ‌నీష్ సిసోడియా(Manish Sisodia). త‌న ఇంటిపై దాడి చేయాల‌ని హైక‌మాండ్ సిబీఐ అధికారుల‌కు సూచించార‌ని అన్నారు.

ఆప్ చీఫ్ విద్య‌, ఆరోగ్య రంగాల‌లో ఎన‌లేని కృషి చేస్తున్నారని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరు వ‌చ్చింద‌న్నారు. దానిని అడ్డుకునేందుకు ఇలాంటి దాడులు చేయిస్తూ సంతోష ప‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌ద్యం పాల‌సీకి సంబంధించి ఎలాంటి అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. పూర్తిగా ఖండించారు. ఎక్సైజ్ పాల‌సీని పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో అమ‌లు చేశామ‌న్నారు.

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక న్యూయార్క్ టైమ్స్ (NewYork Times) ఢిల్లీ ఎడ్యూకేష‌న్ మోడ‌ల్ అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసిస్తూ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురిచింద‌న్నారు. దీనిని మోదీ త‌ట్టుకోలేక పోయారంటూ ధ్వ‌జ‌మెత్తారు సిసోడియా.

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి ఠాకూర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలోనే అవినీతిలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని మండిప‌డ్డారు.

Also Read : దైవ భూమిని ముంచెత్తిన వ‌ర‌ద‌లు

Leave A Reply

Your Email Id will not be published!