YS Jagan : సీజేఐ మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం – జ‌గ‌న్

ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ రెడ్డి

YS Jagan :  భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ(NV Ramana) ఈ గ‌డ్డ మీద పుట్టడం ఏపీకి గ‌ర్వ కార‌ణ‌మ‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

అత్యున్న‌త స్థానంలో ఉన్న సీజేఐ విజ‌య‌వాడ‌లో కోర్టు నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇది త‌న హ‌యాంలో జ‌ర‌గ‌డం మ‌రిచి పోలేన‌న్నారు.

శ‌నివారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ను ప్రారంభించారు సీజేఐ. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ప్ర‌సంగించారు. 2013లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేతుల మీదుగా ఈ కాంప్లెక్స్ కు శంకుస్థాప‌న జ‌రిగంద‌న్నారు.

తిరిగి ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభం కావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు ఏపీ సీఎం. ఇది అంద‌రికీ క‌ల‌కాలం గుర్తుండి పోతుంద‌న్నారు.

జ్యూడీషియ‌రీకి సంబంధించి ప్ర‌తీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌హ‌కారం అంద‌జేస్తుద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలుగులోనే ప్ర‌సంగించారు.

ఇవాళ త‌న న్యాయ కెరీర్ లో గుర్తుండి పోయే క్ష‌ణాల‌ని పేర్కొన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు అద‌న‌పు నిధుల విష‌యంలో కేంద్రం నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్పుడు సీఎంలలో ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan) కూడా ఉన్నార‌ని కొనియాడారు.

పెండింగ్ కేసుల విష‌యంలో స‌త్వ‌ర న్యాయం అందించేందుకు కృషి చేయాల‌నే త‌ప‌న న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌వాదుల‌కు ఉండాల‌ని ఎన్వీ ర‌మ‌ణ ఆకాంక్షించారు.

విభ‌జ‌న అనంత‌రం ఏపీ ఆర్థికంగా వెనుక‌బ‌డింద‌న్నారు సీజేఐ. ఏపీ ప్ర‌జ‌ల్లో కూడా అలాంటి భావ‌న నెల‌కొంద‌న్నారు. తెలుగు రాష్ట్రాల‌లో జ‌డ్జీల‌తో పాటు 250 మంది హైకోర్టు జ‌డ్జీల‌ను, 11 మంది సుప్రీంకోర్టు జ‌డ్జీల‌ను నియ‌మించాన‌ని చెప్పారు.

Also Read : ఏపీలో గ్రామ‌..వార్డుల‌కు నిధుల వెల్లువ‌

Leave A Reply

Your Email Id will not be published!