CJI NV Ramana : స‌త్వ‌ర న్యాయం కోసం కృషి చేయాలి – సీజేఐ

తెలుగులోనే ప్ర‌సంగించిన ఎన్వీ ర‌మ‌ణ

CJI NV Ramana : న్యాయ‌మూర్తులు స‌త్వ‌ర న్యాయం కోసం కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ‌.

న్యాయ శాఖ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌తిరేకించిన స‌మ‌యంలో మ‌ద్ద‌తు ఇచ్చిన సీఎంల‌లో ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఉన్నార‌ని కొనియాడారు.

విజ‌య‌వాడ‌లో కోర్టు కాంప్లెక్స్ ను సీజేఐ శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. అంత‌కు ముందు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌ను ఘ‌నంగా స‌న్మానించారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan).

సీఎం తెలుగులో మాట్లాడాక తాను కూడా తెలుగులో మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. ఇవాళ శంకుస్థాప‌న చేసిన బిల్డింగ్ ను తానే మ‌ళ్లీ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఇది త‌న కెరీర్ లో పూర్తిగా మ‌రిచి పోలేని అంశ‌మ‌న్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు అద‌న‌పు నిధుల విష‌యంలో మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌.

పెండింగ్ కేసుల విష‌యంలో స‌త్వ‌ర న్యాయం అందించేందుకు కృషి చేయాల‌నే త‌ప‌న‌, కోరిక న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌వాదుల‌కు ఉండాల‌ని జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ(CJI NV Ramana) స్ప‌ష్టం చేశారు.

ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ఆర్థికంగా న‌ష్ట పోయింద‌న్న భావ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఉంద‌న్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పున‌రాలోచించాల‌ని సూచించారు సీజేఐ. కేంద్ర స‌ర్కార్ రాష్ట్రానికి తోడ్పాటు అందించాల‌ని కోరారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

తాను సీజేఐగా కొలువు తీరాక రెండు తెలుగు రాష్ట్రాల‌లో జ‌డ్జీల ఖాళీల‌ను భ‌ర్తీ చేశాన‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా 250 మంది హైకోర్టు జ‌డ్జీల‌ను , 11 మంది సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : సీజేఐ మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం – జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!