Defamation Case : కేజ్రీవాల్..యోగేంద్ర..సిసోడియాకు ఊర‌ట

ప‌రువు న‌ష్టం కేసులో నిర్దోషులని తీర్పు

Defamation Case :  ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా , సామాజిక కార్య‌క‌ర్త యోగేంద్ర యాద‌వ్ కు భారీ ఊర‌ట ల‌భించింది. ప‌రువు న‌ష్టం కేసులో(Defamation Case) నిర్దోషులుగా విడుద‌ల‌య్యారు.

అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) విధి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌హ‌రించిన మీడియా నివేదిక‌ల నుండి ఫిర్యాదుదారు ప‌రువు న‌ష్టం కేసును స్థాపించ లేర‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌డే స‌మ‌యంలో ముగ్గురు వ్య‌క్తులు కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆప్ అభ్య‌ర్థిత్వాన్ని 2013లో ర‌ద్దు చేశారంటూ లాయ‌ర్ సురేంద‌ర్ శ‌ర్మ దాఖ‌లు చేసిన క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆప్ మాజీ చీఫ్ యోగేంద్ర యాద‌వ్ ల‌ను రోస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించింది.

ఫిర్యాదుదారు పేర్కొన్న మీడియా క‌థ‌నాల‌ను ప‌రిశీలించామ‌ని , ఫిర్యాదుదారు ఈ నివేదిక‌ల నుండి ప‌రువు న‌ష్టం కేసును స్థాపించ లేర‌న్నారు.

కేసు విచార‌ణ సంద‌ర్భంగా అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించిన సురేంద‌ర్ కుమార్ శ‌ర్మ అనే న్యాయ‌వాది ఈ కేసును దాఖ‌లు చేశారు. ఆయ‌న మేన‌ల్లుడు కోర్టులో కేసును కొన‌సాగిస్తూ వ‌చ్చారు.

2013లో ఎన్నిక‌ల‌కు ముందు ఆప్ కి చెందిన ప‌లువురు వాలంటీర్లు త‌న‌ను సంప్ర‌దించార‌ని , అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని కోరార‌ని తెలిపారు. కేజ్రీవాల్ సామాజికంగా సంతృప్తి చెందార‌ని సురేంద‌ర్ కుమార్ శ‌ర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read : దేశంలో 4.83 కోట్లకు పెరిగిన కేసులు – రిజిజు

Leave A Reply

Your Email Id will not be published!