Anand Sharma : స్టీరింగ్ కమిటీకి ఆనంద్ శర్మ రాజీనామా
పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి గుడ్ బై
Anand Sharma : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. సుదీర్ఘ కాలం పాటు పార్టీలో కొనసాగుతూ వస్తున్న ఆనంద్ శర్మ ఆదివారం హిమాచల్ కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు.
గత ఏప్రిల్ నెలలో పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ శర్మ నియమితులయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. తనకు పార్టీ కంటే ఆత్మ గౌరవం ముఖ్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అసమ్మతి వర్గంగా జి-23లో మరో సభ్యుడు జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి గుడ్ బై చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కూడా రాజీనామా పర్వం చోటు చేసుకోవడం పార్టీకి ఒకింత షాక్ అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా సంప్రదింపుల ప్రక్రియలో తనను విస్మరించారంటూ ఆనంద్ శర్మ(Anand Sharma) కాంగ్రెస్ చీఫ్ తో పేర్కొన్నారు.
అయితే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శర్మ గతంలో కేంద్రంలో మంత్రిగా పని చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడిగా ఉన్నారు.
ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్ లో స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా గులాం నబీ ఆజాద్ , ఆనంద్ శర్మ ఇద్దరూ జి-23లో ప్రముఖ నాయకులుగా ఉన్నారు.
పార్టీ సమావేశాలకు సంబంధించి ఆహ్వానం లేక పోవడం , సంప్రదించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read : ఇలాగైతే కష్టం దేశానికి నష్టం – సీఎం