Bandi Sanjay : లిక్కర్ స్కాం క్వీన్ కవితను అరెస్ట్ చేయాలి
బీజేపీ స్టేట్ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Bandi Sanjay : మద్యం పాలసీ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.
తాము చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మార్చేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా హైదరాబాద్ లో కవిత ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్.
ప్రజా స్వామ్యంలో నిరసన తెలపడం తమ హక్కు అని అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా జనగాంలో ధర్మ దీక్ష చేపట్టిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన అరెస్ట్ ను కేంద్ర మంత్రులతో పాటు పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా సైతం తీవ్రంగా ఖండించారు. కాగా అక్రమాలకు పాల్పడిన కవితను సస్పెండ్ చేయాలన్నారు.
పోలీసులు హత్యాయత్నం పేరుతో కేసులు ఎలా నమోదు చేస్తారంటూ ప్రశ్నించారు బండి సంజయ్(Bandi Sanjay). అయితే ప్రజా సంగ్రామ యాత్రకు పర్మిషన్ లేదని, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారంటూ బస్సులోంచి బీజేపీ స్టేట్ చీఫ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ కుమార్ పటేల్ మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
తమ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా పేర్కొన్నారు.
Also Read : ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకమాండ్ షాక్
🔸లిక్కర్ స్కాంలో తన కూతురిపై ఆరోపణలు వచ్చాయి.దీనిపై ప్రజల మధ్య చర్చ జరగకుండా ఉండాలి.అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకే నేడు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారు.
🔸యాత్ర ఎక్కడ ఆపినామో,అక్కడి నుంచే యాత్ర చేస్తం.27న వరంగల్ కు మా జాతీయ అధ్యక్షులు వస్తారు.పక్కా సభను నిర్వహించి తీరుతాం pic.twitter.com/lKN4g3rLmU— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 23, 2022