Nitish Test Of Majority : బ‌ల ప‌రీక్ష‌కు సిద్ద‌మైన నితీశ్ స‌ర్కార్

అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన బీజేపీ

Nitish Test Of Majority : 17 ఏళ్ల సుదీర్ఘ బంధానికి తెర దించి ఆర్జేడీ, కాంగ్రెస్, ఇత‌ర పార్టీల‌తో జ‌త క‌ట్టిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. సీఎంగా నితీశ్ , డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ తో పాటు 31 మందితో కేబినెట్ విస్త‌ర‌ణ పూర్త‌యింది.

ఇదిలా ఉండ‌గా త‌మ నుంచి విడి పోయి ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో జ‌త క‌ట్టిన మ‌హాకూట‌మి ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. దీంతో బుధ‌వారం నితీశ్ స‌ర్కార్ బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ద‌మైంది.

ఇదిలా ఉండ‌గా బీహార్ మ‌హా కూట‌మి 164 సీట్ల బ‌లాన్ని క‌లిగి ఉంది. అసెంబ్లీలో స్పీక‌ర్ సాక్షిగా కీల‌క‌మైన ఘ‌ట్టం చోటు చేసుకోనుంది. ప్ర‌స్తుతం బ‌ల ప‌రీక్ష‌కు సంబంధించి చూస్తే బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 మంది స‌భ్యులు ఉన్నారు.

ఇందులో 164 మంది ఎమ్మెల్యేలతో బ‌లంగా ఉంది నితీశ్ మ‌హా ఘ‌ట్ బంధన్ కొలువు తీరింది. మొత్తం స‌భ్యుల‌లో ఇద్ద‌రు లేరు. దీంతో బ‌లం 241కి త‌గ్గింది.

ఇక ప్ర‌భుత్వం ఏర్పాటు కావాల‌న్నా, మెజారిటీ నిరూపించు కోవాలంటే 121 మంది స‌భ్యులు(Nitish Test Of Majority) కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా కావాల్సిన బ‌లం కంటే ఎక్కువ ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లం క‌లిగి ఉంది మ‌హా కూట‌మి ప్ర‌భుత్వం.

ఇవాళ బ‌ల‌ప‌రీక్ష పూర్తిగా నామ మాత్రంగా జ‌రగ‌నుంది. కాగా ప్ర‌భుత్వం మారిన‌ప్ప‌టికీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న స్పీక‌ర్ విజ‌య్ కుమార్ సిన్హా రాజీనామా చేసేందుకు నిరాక‌రించారు.

దీంతో స‌భలో కొన్ని ఉత్కంఠ భ‌రిత స‌న్నివేశాల‌కు వేదిక కానుంది. మ‌రో వైపు కొత్త స్పీక‌ర్ గా ఆర్జేడీ సీనియ‌ర్ నేత అవ‌ధ్ బిహారీ చౌద‌రి పేరును రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదించిన‌ట్లు తెలుస్తోంది.

Also Read : ఆర్జేడీ నేత‌ల‌ ఇళ్ల‌పై సీబీఐ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!