Priyanka Gandhi : తెలంగాణ కాంగ్రెస్ పై ప్రియాంక ఫోకస్
ఎవరూ బహిరంగ వేదికలపై మాట్లాడొద్దు
Priyanka Gandhi : తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్లు సీరియస్ గా స్పందిస్తే మిగతా వారు ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ప్రముఖ మేధావిగా పేరొందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ సైతం పార్టీ తీరుపై, టీపీసీసీ చీఫ్ ఒంటెద్దు పోకడపై ఘాటుగా స్పందించారు.
పార్టీ పార్టీ లాగా నడవడం లేదని ఫ్రాంచైజీ వ్యవహారంగా మారిందంటూ ఆరోపణలు చేశారు. ఇంకో వైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
ఇదే సమయంలో ఆయనపై అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం రచ్చకు దారి తీసింది.
ఇదే సమయంలో మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇంకో వైపు రేవంత్ రెడ్డి వర్సెస్ వెంకట్ రెడ్డిగా మారి పోయింది.
ఇలాగే వదిలి వేస్తే పార్టీ గతి తప్పే ప్రమాదం ఉందని గ్రహించింది పార్టీ హైకమాండ్. ఈ మేరకు దిద్దుబాటు చర్యలకు దిగింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రంగంలోకి దిగారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ఇక నుంచి తానే పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఏమైనా ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే తనతో నేరుగా సంప్రదించాలని కోరారు.
Also Read : నేనుండగా తెలంగాణను ఆగం కానివ్వను