NV Ramana : ఢిల్లీకి వెళ్లే ముందు జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌న్నారు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ

NV Ramana :  భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించే కంటే ముందు ఢిల్లీకి వెళుతున్నారా అని అడిగార‌ని, కాస్తా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించార‌ని చెప్పారు.

48వ సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆగ‌స్టు 26 శుక్ర‌వారం రోజు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం త‌న కెరీర్ లో మ‌రిచి పోలేనిద‌న్నారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana).

త‌న ప‌ద‌వీ కాలంలో అత్యంత సంతృప్తిక‌ర‌మైనదిగా ముగిసింద‌న్నారు. ఒక ర‌కంగా ఒక వ్య‌క్తి జీవిత కాలంలో ఇలాంటి అరుదైన ప‌ద‌విని అధిరోహించే అవ‌కాశం ల‌భించ‌డం ఆషా మాషీ వ్య‌వ‌హారం కాద‌న్నారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

సుప్రీంకోర్టు కొలీజియం త‌న ప‌ద‌వీ కాలంలో దాదాపు 224 మంది న్యాయ‌మూర్తుల‌ను ప‌లు హైకోర్టుల‌లో విజ‌య‌వంతంగా నియ‌మించింద‌ని తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన దాదాపు అన్ని పేర్ల‌ను క్లియ‌ర్ చేసింద‌ని చెప్పారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

ఈ సిఫార‌సులు ఆమోదం పొందుతాయ‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు. త‌న ప‌ద‌వీ కాలంలో న్యాయ‌మూర్తుల నియామ‌కం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

న్యాయ‌వాదుల అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా తాను విధులు నిర్వ‌హించిన‌ట్లు భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఆశించిన అంచ‌నాల కంటే ఎక్కువ‌గానే తాను ప‌ని చేశాన‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న సంద‌ర్భంగా ఢిల్లీ బార్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు స‌న్మానం చేశారు.

Also Read : జ‌ర్న‌లిస్టుల‌కు సీజేఐ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!