US Suspends Flights : క‌రోనా ఎఫెక్ట్ 26 చైనా విమానాలు బంద్

చైనా..అమెరికా రాక పోక‌ల‌కు ఇబ్బంది

US Suspends Flights :  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా చైనాకు షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు 26 విమానాల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు(US Suspends Flights) స్ప‌ష్టం చేసింది.

ఈ నిర్ణ‌యంతో జియామెన్, ఎయిర్ చైనా, చైనా స‌ద‌ర‌న్ ఎయిర్ లైన్స్ , చైనా ఈస్ట‌ర్న్ ఎయిర్ లైన్స్ సెప్టెంబ‌ర్ 5 నుండి సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు న‌డిచే విమానాల‌ను నిలిపి వేయాల్సి వ‌చ్చింది.

మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి బీజింగ్ , వాషింగ్ట‌న్ విమాన సేవ‌ల‌పై ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. క‌రోనా కేసుల‌పై కొన్ని యుఎస్ క్యారియ‌ర్ విమానాల‌ను నిలిపి వేయాల‌ని చైనా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌తిస్పంద‌న‌గా నాలుగు చైనా క్యారియ‌ర్ ల ద్వారా యుఎస్ నుండి చైనాకు వెళ్లే 26 విమానాల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు యుఎస్ ప్ర‌భుత్వం తెలిపింది.

యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేష‌న్ ఇటీవ‌లి 26 అమెరిక‌న్ ఎయిర్ లైన్స్ , డెల్టా ఎయిర్ లైన్స్ , యునైటెడ్ ఎయిర్ లైన్స్ ర‌ద్దును ఉద్ద‌హ‌రించింది.

స‌స్పెన్ష‌న్ ల‌లో లాస్ ఏంజెల్స్ నుండి 19 విమానాలు , న్యూయార్క్ నుండి 7 చైనా ఈస్ట‌ర్న్ విమానాలు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా అమెరికా తీసుకున్న నిర్ణ‌యంపై వాషింగ్ట‌న్ లోని చైనా రాయ‌బార కార్యాల‌యం ఇంకా స్పందించ లేదు.

చైనాకు వ‌చ్చిన త‌ర్వాత కోవిడ్ -19కి పాజిటివ్ ప‌రీక్షించేందుకు మాత్ర‌మే ప్ర‌యాణికులు యుఎస్ నుండి త‌మ విమానం ఎక్కేముందు కంప‌ల్స‌రీ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

క‌రోనా పేరుతో ఇలాంటి చ‌ర్య‌లు అమెరికా చేప‌ట్ట‌డంపై చైనా తీవ్ర అభ్యంత‌రం తెలిపింది.

Also Read : ర‌ష్యాకు వ్య‌తిరేకంగా భార‌త్ ఓటు

Leave A Reply

Your Email Id will not be published!