Supreme Court : ఉచితాలపై సుప్రీం ప్యానెల్ ఏర్పాటు
సంచలన కామెంట్స్ చేసిన ధర్మాసనం
Supreme Court : రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలుగా ఇచ్చే ఉచితాలపై శుక్రవారం విచారణ చేపట్టింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు. ఈ అంశంపై 2013 నాటి తీర్పును ప్రస్తావించింది.
ఈ అంశంపై రాజకీయ చర్చ నడుస్తుండగా ఉచితాలకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ఓటరుపై ఉంటుంది.
ఓటర్లు, పార్టీలు, అభ్యర్థులకు న్యాయ నిర్ణేతగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ప్రారంభంలో కోర్టు హ్యాండ్ ఔట్ లను ఆపడేందుకు అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోక పోతే ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం కొనసాగుతుందని కోర్టు అభిప్రాయపడింది.
ఎన్నికల వాగ్ధానాలను నియంత్రించే అంశం నిర్వహించ లేనిది అని కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా ఉచితాలు, హామీలు, సంక్షేమ పథకాల పేరుతో పార్టీలు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ.
దీనిపై ఎన్ని అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తినా దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కాగా ఉచితాలపై సీజేఐ ఎన్వీ రమణ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ, తమిళనాడు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సంక్షేమ పథకాలు ఉచితాలు కావంటూ పేర్కొన్నారు.
రాజకీయ కోణంలో చూడకూడదని పేర్కొన్నారు. 75 ఏళ్ల పాటు స్వతంత్రం వచ్చినా నేటికీ ప్రజల మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయని సీఎంలు తెలిపారు. ఉచితాలు అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది.
Also Read : కేజ్రీవాల్ పై హిమంత బిస్వా శర్మ కన్నెర్ర