Ghulam Nabi Azad : గులాం న‌బీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై

134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

Ghulam Nabi Azad : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం తాను పార్టీని విడిచి పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పార్టీకి గుబ్ బై చెబుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలం నుంచీ పార్టీలో ఉంటూనే ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. జి-23 పేరుతో అస‌మ్మ‌తి వాదుల‌తో టీంను ఏర్పాటు చేశారు.

2020లో సోనియా గాంధీకి సీరియ‌స్ గా లేఖ రాశారు. సంస్థ పూర్తి పున‌ర్నిర్మాణం , పూర్తి స‌మ‌యం క‌నిపించే నాయ‌క‌త్వం కోసం పిలుపునిచ్చారు. సుదీర్గ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడిగా పేరొందారు గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad).

ఆయ‌నను ఒక ర‌కంగా ట్ర‌బుల్ షూట‌ర్ గా పిలుస్తారు. పార్టీ నేత‌లు భావిస్తారు కూడా. పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కు తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఏఐసీసీ చీఫ్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ త‌రుణంలో మ‌రో వికెట్ ప‌డ‌డం కోలుకోలేని షాక్ కు గురి చేసింది.

ఇదిలా ఉండ‌గా చికిత్స కోసం సోనియా గాంధీ అమెరికాకు వెళ్ల‌నున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా వెళ్ల‌నున్నారు.

2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావడానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. 134 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన పార్టీని సీనియ‌ర్లు, పిల్ల‌ర్స గా ఉంటూ వ‌చ్చిన వారంతా గుడ్ బై చెబుతున్నారు.

Also Read : క‌రోనా ఎఫెక్ట్ 26 చైనా విమానాలు బంద్

Leave A Reply

Your Email Id will not be published!