Dushyant Dave : ర‌మ‌ణ‌కు వీడ్కోలు లాయ‌ర్ క‌న్నీరు మున్నీరు

దేశ పౌరుల‌కు సీజేఐ ఆద‌ర్శంగా నిలిచారు

Dushyant Dave : భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా శుక్ర‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ బార్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో స‌న్మానం చేశారు. చీఫ్ జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ కు ఘ‌నంగా స‌న్మానం చేశారు.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ లాయ‌ర్ దుష్యంత్ ద‌వే(Dushyant Dave) క‌న్నీరు మున్నీర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీజేఐని ప్ర‌శంసించారు.ఈ దేశంలోని అనేక మంది పౌరుల‌కు అండ‌గా నిలిచార‌ని , వారి హ‌క్కుల‌ను, రాజ్యాంగాన్ని స‌మ‌ర్థించార‌ని ప్ర‌శంసించారు.

ఆయ‌న మాట్లాడుతున్నంత సేపు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ‌ను పౌర న్యాయ‌మూర్తిగా దుష్యంత్ ద‌వే అభివ‌ర్ణించారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌, కార్య నిర్వాహ‌క , పార్ల‌మెంట్ మ‌ధ్య తాను త‌నిఖీలు , స‌మ‌తుల్య‌త‌ను కొన‌సాగాన‌ని, వెన్నెముక‌తో అలా చేశాన‌న్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న ప్ర‌ధాన న్యాయూమ‌ర్తి ఎన్వీ ర‌మ‌ణ‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం బాధ‌కు గురి చేసింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న స‌హోద్యోగి సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ ఎన్వీ ర‌మ‌ణ‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. క‌ల్లోలాల స‌మ‌యాల్లో కూడా స‌మ‌తుల్య‌త‌ను కాపాడు కోవ‌డం కోసం కోర్టు ఆయ‌న‌ను గుర్తుంచుకుంటుంద‌ని అన్నారు.

ఈ దేశంలోని విస్తార‌మైన పౌరుల త‌రపున మాట్లాడుతున్నాను. మీరు వారంద‌రికీ భ‌రోసా క‌ల్పించార‌ని ప్ర‌శంసించారు. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ న్యాయ‌మూర్తుల కుటుంబాన్ని కూడా చూసుకున్నార‌ని క‌పిల్ సిబల్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

స‌ముద్రం ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడు ఓడ ప్ర‌యాణిస్తుంది. మేము చాలా అల్ల‌క‌ల్లోలంగా ఉన్నాం. ఈ స‌మ‌యంలో ఓడ జ‌ర్నీ చేయ‌డం క‌ష్టం. ఈ క‌ష్ట స‌మ‌యంలో సీజేఐగా ఎన్వీ ర‌మ‌ణ వ‌చ్చారు. త‌న‌దైన పాత్ర పోషించార‌ని పేర్కొన్నారు క‌పిల్ సిబ‌ల్.

Also Read : ఢిల్లీకి వెళ్లే ముందు జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌న్నారు

Leave A Reply

Your Email Id will not be published!