Omar Abdullah : కాంగ్రెస్ కూలి పోవడం బాధగా ఉంది
గులాం నబీ ఆజాద్ రిజైన్ పై కామెంట్
Omar Abdullah : నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కూలి పోవడం చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్(Gulam Nabi Azad) సడెన్ గా పార్టీని వీడడంపై కామెంట్ చేశారు.
అత్యంత అనుభవం కలిగిన నాయకుడు పార్టీకి గుడ్ బై చెప్పడం ఆయనకంటే పార్టీకే తీరని నష్టం అని అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఎవరి పార్టీ వారిదే అయినప్పటికీ కలిసి కూటమిగా గత కొంత కాలం పాటు ఉన్నామని అందుకే తాను ఈ విధంగా వ్యాఖ్యానించాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah).
దేశంలో ఒక పార్టీ రాచరిక వ్యవస్థను తిరిగి తీసుకు వస్తోందంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కూలి పోవడాన్ని తాను పదే పదే గుర్తు చేయాల్సి వచ్చిందన్నారు.
తనను ఎంతో బాధకు గురి చేసిందని గుర్తు చేశారు మరోసారి ఒమర్ అబ్దుల్లా. త్వరలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీకి గులాం నబీ ఆజాద్ ఉండాల్సి ఉందని పేర్కొన్నారు.
ఒక రకంగా పార్టీకి కోలుకోలేని దెబ్బ అని హెచ్చరించారు. గతంలో ఎంతో మంది పార్టీ నుంచి విడి పోయారు. కానీ గులాం నబీ ఆజాద్ లాంటి అత్యంత అనుభవం కలిగిన అరుదైన నాయకుడు వెళ్లి పోవడం పూర్తిగా తనను విస్మయానికి గురి చేసిందన్నారు ఒమర్ అబ్దుల్లా.
Also Read : రాహుల్ గాంధీపై ఆజాద్ ఆగ్రహం