CM Bommai : హైక‌మాండ్ పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది – బొమ్మై

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన క‌ర్ణాట‌క సీఎం

CM Bommai :  క‌ర్ణాట‌క‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం బొమ్మైని(CM Bommai)  మారుస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో బ‌స్వ‌రాజ్ బొమ్మై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

శ‌నివారం ఆయ‌న ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. హైక‌మాండ్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్ణాట‌క‌లో 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి బొమ్మై నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని బీజేపీ అధికారికంగా ఇంకా ధ్రువీక‌రించ లేదు.

మ‌రో వైపు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన మాజీ సీఎం బీఎస్ యెడియూర‌ప్ప‌కు కేంద్రంలో కీల‌క‌మైన ప‌ద‌వి అప్ప‌గించింది. మ‌రో వైపు నితిన్ గ‌డ్క‌రీ, యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) కు చెక్ పెట్టింది.

కాగా ఇప్ప‌టికీ ఇంకా సీఎం మార్పుపైనే జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎంను మారుస్తారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేశారు బొమ్మై. ఇదంతా కొంద‌రు గిట్ట‌ని వారు ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌చారంగా నిప్పులు చెరిగారు.

మ‌రి ఎందుకు యెడియూర‌ప్ప‌ను(yediyurappa) తొల‌గించార‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న జ‌వాబు ఇవ్వ‌లేదు. ఎవ‌రైనా స‌రే పార్టీ కోసం ప‌ని చేయాల్సిందే. హైకమాండ్ సుప్రీం. ప్ర‌స్తుతం వ‌చ్చిన ముప్పేమీ లేద‌న్నారు.

తాను ఏమీ ఆందోళ‌న చెంద‌డం లేద‌ని, తాము చాప కింద నీరు లాగా ప‌ని చేసుకుంటూ పోతున్నామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైతం త‌మ‌దే అధికార‌మ‌ని బొమ్మై ధీమా వ్య‌క్తం చేశారు.

తాను యెడ్డీ చేతిలో కీలుబొమ్మ‌ను కాన‌ని కానీ ఆయ‌న‌కు అనుంగు అరుచ‌రుడిన‌ని చెప్పారు సీఎం. కాగా రోజూ వారీ కార్య‌క‌లాపాల‌లో యెడ్డీ జోక్యం చేసుకుంటార‌నే దానిని పూర్తిగా ఖండించారు బొమ్మై.

Also Read : జార్ఖండ్ సీఎంకు గ‌వ‌ర్న‌ర్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!