Jharkhand CM : జార్ఖండ్ లో సోరేన్ కిం కర్తవ్యం
శాసనసభ సభ్యత్వం రద్దు
Jharkhand CM : జార్ఖండ్ లో జేఎంఎం సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సీఎం హేమంత్ సోరేన్ కు(Jharkhand CM) ఊహించని రీతిలో మైండ్ బ్లాక్ అయ్యేలా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ చేసిన ఆరోపణల మేరకు ఎందుకు సీఎం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయకూడదోనని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఆ మేరకు సీఎం స్థాయిలో ఉంటూ తనంతకు తానుగా మైన్స్ లీజుకు తీసుకోవడం అక్రమమేనని పేర్కొంది ఈసీ. ఈ మేరకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చంటూ స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదు హేమంత్ సోరేన్ కు(Jharkhand CM) . ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు అయినప్పటికీ ఆరు నెలల వరకు సీఎంగా ఉంటారు. ఆ తర్వాత తాను నిర్దోషినని నిరూపించు కోవాలి. లేక పోతే సీఎం పోస్ట్ కోల్పోతారు.
కేంద్రంలోని మోదీ, బీజేపీ ప్రభుత్వం కావాలని నాటకాలు ఆడుతోందని, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉందని ఆరోపించింది జేఎంఎం.
సీఎం రూల్స్ కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కావాలని శాసనసభ సభ్యత్వం రద్దు చేసిందంటూ మండిపడ్డారు పార్టీ ఎంపీ.
కాగా గెజిట్ పై అనర్హత ఉత్తర్వులను గవర్నర్ నోటిఫై చేసిన తర్వాత సోరేన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన కేబినెట్ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా హేమంత్ సోరేన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. కానీ ప్రజా బలంతో ఎన్నికైన తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
Also Read : డిజిటల్ చెల్లింపుల ఛార్జీలపై కామెంట్స్