Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ గా రాహుల్ ను ఒప్పిస్తాం

కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లికార్జున ఖ‌ర్గే కామెంట్

Mallikarjun Kharge :  కాంగ్రెస్ పార్టీ సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. మ‌రో వైపు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ అనారోగ్యం కార‌ణంగా అమెరికాకు వెళుతోంది.

ఆమె వెంట కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వెళ్ల‌నున్నారు. ఈ త‌రుణంలో త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నికపై ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రో వైపు 50 ఏళ్ల పాటు పార్టీతో అనుబంధం క‌లిగి ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టిన గులాం న‌బీ ఆజాద్ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు ఆయ‌న రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు.

ఆయ‌న నిర్వాకం కార‌ణంగానే పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టింద‌ని ఆరోపించారు. ఆపై సోనియా గాంధీని మెచ్చుకున్నారు. పార్టీలో చ‌ర్చ‌లు, ఆలోచ‌న‌లు, సంప్ర‌దింపులు అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు.

ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల‌నే బీజేపీ బ‌ల‌ప‌డింద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ త‌రుణంలో గాంధీ ఫ్యామిలీ పూర్తిగా పార్టీ చీఫ్ ప‌ద‌విపై నిరాస‌క్త‌త‌తో ఉన్న‌ట్టు స‌మ‌చారం.

గాంధీయేత‌ర వ్య‌క్తికి ఏఐసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని సూచించిన‌ట్లు జోరుగా ప్రచారం జ‌రిగింది. ఆజాద్ వెంట మ‌రికొంద‌రు సీనియ‌ర్లు వెళ్ల‌నున్న‌ట్లు టాక్.

ఈ కీల‌క స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్య‌స‌భ ప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ చీఫ్ గా ఒప్పుకోక పోయినా తాము రాహుల్ గాంధీని అధ్య‌క్షుడిగా ఉండేలా ఒత్తిడి తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

శ‌నివారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : సోనాలీ కేసులో క్ల‌బ్ ఓన‌ర్..డ్ర‌గ్ లీడ‌ర్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!