Letter to PM : క‌ర్ణాట‌క విద్యా శాఖ అవినీతిపై పీఎంకు లేఖ

విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్ పై ఆరోప‌ణ‌

Letter to PM : భార‌తీయ జ‌న‌తా పార్టీ నేతృత్వంలోని బ‌స్వ‌రాజ్ బొమ్మై స‌ర్కార్ పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సీఎం పోస్టు ఖ‌రీదు రూ. 2,500 కోట్లు అంటూ కాంగ్రెస పార్టీ ఆరోపించింది.

ఈ త‌రుణంలో తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలోని 13,000 స్కూళ్ల‌కు చెందిన య‌జ‌మానులతో కూడిన రెండు సంఘాలు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశాయి. ఈ మేర‌కు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ(Letter to PM) రాశాయి.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా శాఖ‌లో అవినీతి రాజ్యం ఏలుతోందంటూ ఆరోపించాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప‌ట్టించు కోలేద‌ని వాపోయాయి.

తాము చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌ధానిని కోరాయి. విద్యా సంస్థ‌ల‌కు గుర్తింపు ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యా శాఖ లంచాలు డిమాండ్ చేస్తున్నాయ‌ని ఆరోపించాయి.

ఈ విష‌యాన్ని వెంట‌నే ప‌రిశీలించాల‌ని అసోసియేటెడ్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఫ్రైమ‌రీ అండ్ సెకండ‌రీ స్కూల్స్ , రిజిస్ట‌ర్డ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేష‌న్ సంయుక్తంగా పీఎంను కోరారు.

అశాస్త్రీయ‌మైన‌, అహేతుక‌మైన‌, వివక్షా పూరితంగా పాటించ‌ని నిబంధ‌న‌లు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తింప చేశార‌ని, భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌ని మండిప‌డ్డాయి.

విద్యా శాఖ మంత్రి వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాయి. ఇద్ద‌రు మంత్రులు త‌మ ఇష్టానుసారం కార్పొరేట్ ల‌కు విద్యా వ్య‌వ‌స్థ‌ను క‌ట్టబెట్ట‌డం వ‌ల్ల‌నే త‌మ‌కు ఇన్ని ఇబ్బందులు ఎదురైన‌ట్లు వారు వాపోయారు.

దీనిని నివారించేందుకు త‌మ‌రు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Also Read : అస్సాం సీఎంపై కేజ్రీవాల్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!