Delhi CM : స‌ర్కార్లు కూల్చేందుకు రూ. 6,300 కోట్లు

కేంద్ర బీజేపీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Delhi CM : ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్(Delhi CM) కామెంట్స్ చేశారు. దేశంలో ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని మోదీ, బీజేపీ స‌ర్కార్ ఏకంగా రూ. 6,300 కోట్లు ఖ‌ర్చు చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అంతే కాదు కాషాయ పార్టీని రాష్ట్ర ప్ర‌భుత్వాల సీరియ‌ల్ కిల్ల‌ర్ అని పిలిచారు. ప్ర‌స్తుతం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

జీఎస్టీ, ఇంధ‌న ధ‌ర‌ల పెంపు ద్వారా సేక‌రించిన డ‌బ్బుల‌ను బీజేపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు ఖ‌ర్చు చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

వీటిని గ‌నుక ఖ‌ర్చు చేయ‌క పోతే ఆహార ప‌దార్థాల‌పై కేంద్రం వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) విధించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్య‌ల్ని శ‌నివారం చేశారు.

ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో సీఎం సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. జీఎస్టీతో స‌మ‌కూరిన డ‌బ్బుల్ని, డీజిల్, పెట్రోల్ ధ‌రల పెంపు ద్వారా ఎమ్మెల్యేల‌ను వేటాడం, బెదిరించ‌డం కోసం బీజేపీ ఉప‌యోగిస్తోందంటూ మండిప‌డ్డారు.

కేంద్రంద నిర్వాకం కార‌ణంగానే ఇవాళ దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ధ‌రాభారాన్ని మోయాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

పెరుగు, మ‌జ్జిగ‌, తేనె, గోధుమ‌లు, బియ్యం మొద‌లైన వాటిపై విధించిన జీఎస్టీ వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వానికి సంవ‌త్స‌రానికి ఊ. 7,500 కోట్ల ఆదాయం వ‌స్తోంద‌ని చెప్పారు.

ఎల్జీ వీకే స‌క్సేనా సిఫార్సు మేర‌కు ఎక్సైజ్ పాల‌సీ అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల‌పై డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా , త‌దిత‌రుల‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఆనాటి నుంచి నేటి దాకా ఆప్, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది.

Also Read : అస్సాం సీఎంపై కేజ్రీవాల్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!