Jyotiraditya Scindia : కాంగ్రెస్ పార్టీపై సింధియా సీరియస్
రాహుల్ గాంధీ నిర్వాకం వల్లే ఇదంతా
Jyotiraditya Scindia : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మరికొందరు నాయకులు ఆ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరో వైపు కొద్ది రోజుల్లా పార్టీ చీఫ్ ఎన్నిక జరగనుంది. ఈ తరుణంలో అదే పార్టీలో ఉంటూ రాహుల్ గాంధీతో పొసగక బయటకు వచ్చేశారు ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia).
ఆయన కొంత కాలం కిందట కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. తక్షణమే కేబినెట్ లో కొలువు తీరారు. ఈ తరుణంలో తాను ఎందుకు వీడాల్సి వచ్చిందనే దానిపై మరోసారి నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం పార్టీలో ఎవరూ ఉండరని, గాంధీ ఫ్యామిలీ మాత్రమే చివరకు మిగులుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కొనే సత్తా, దమ్ము ఆ పార్టీకి లేదన్నారు. గాంధీ ఫ్యామిలీ ఒక్కటే పార్టీని రక్షించదని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలం పాటు పార్టీని నడిపించి, కష్ట కాలంలో ఆదుకున్న సీనియర్ నాయకుడు, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రిగా పని చేసిన గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం పెద్ద దెబ్బ అని స్పష్టం చేశారు జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia).
ప్రస్తుతం పార్టీకి దేశంలో అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీలో ఇప్పుడు కాదు గత కొన్నేళ్ల కిందటే గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.
ఆయన పార్టీ నుంచి విముక్తి పొందడం మంచిదేనని పేర్కొన్నారు జ్యోతిరాదిత్యా సింధియా.
Also Read : కాంగ్రెస్ చీఫ్ గా రాహుల్ ను ఒప్పిస్తాం