Jharkhand Crisis : జార్ఖండ్ ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్ కు త‌ర‌లింపు

మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారిన రాజ‌కీయ సంక్షోభం

Jharkhand Crisis : జార్ఖండ్ లో జేఎంఎం సంకీర్ణ ప్ర‌భుత్వం ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ నెల‌కొంది. రాజ‌కీయ సంక్షోభం మ‌రింత ముదిరింది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కూల్చేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తోందంటూ జేఎంఎం ఆరోపిస్తోంది.

ఇదే స‌మ‌యంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్ ఎమ్మెల్యే గా ప‌నికి రాడంటూ గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయ‌న త‌నంత‌కు తానుగా మైన్స్ లీజుకు కేటాయించు కున్నార‌ని, అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడంటూ బీజేపీ ఆరోపించింది.

ఈ మేర‌కు ఫిర్యాదు అందిన వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాయ‌డం, అక్క‌డి నుంచి వాస్త‌వ‌మ‌ని తేలితే వెంట‌నే సీఎంకు చెందిన శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయ‌వ‌చ్చంటూ స్ప‌ష్టం చేసింది.

దీంతో స‌రైన ఆధారం కోసం వేచి చూస్తున్న గ‌వ‌ర్న‌ర్ ఉన్న‌ట్టుండి సీఎం హేమంత్ సోరేన్ కు(Jharkhand Crisis) షాక్ ఇచ్చారు. అయితే ఆయ‌న త‌న నిర్దోషిత్వాన్ని ఆరు నెల‌ల లోపు నిరూపించు కోవాల్సి ఉంటుంది.

అంత వ‌ర‌కు సీఎంగా ఉండ‌వ‌చ్చు. కానీ బీజేపీ మాత్రం వెంట‌నే అత‌డిని తప్పించాల‌ని, ప్ర‌భుత్వాన్ని పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది.

స‌ర్కార్ ను తొల‌గించి కొత్త‌గా ఎన్నిక‌ల‌కు పిలుపు ఇవ్వాల‌ని కోరుతోంది. దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సింది గ‌వ‌ర్న‌ర్ . రాజ్యాంగ బ‌ద్దంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అన్న దానిపై ఆలోచ‌న చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా సోరేన్ త‌న అధికార శిబిరం ఎమ్మెల్య‌ల‌ను ఖుంటి లోని గెస్ట్ హౌస్ కు తీసుకు వెళ్లారు. బీజేపీ వ‌ల‌లో ప‌డ‌కుండా ఉండేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

Also Read : స‌ర్కార్లు కూల్చేందుకు రూ. 6,300 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!