134 Ex-Bureaucrats : బిల్కిస్ దోషుల విడుదల అమానవీయం
134 మంది మాజీ ఉన్నతాధికారుల లేఖ
134 Ex-Bureaucrats : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య ఘటన కేసులో యావజ్జీవ ఖైదుకు గురైన 11 మంది దోషులను నిస్సిగ్గుగా గుజరాత్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది.
భారత జాతి తల వంచుకునేలా దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15న రిలీజ్ చేయడం తీవ్ర నిరసనకు దారి తీసింది. దేశంలోని మేధావులు, మహిళలు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తీవ్రంగా తప్పు పట్టారు.
విచిత్రం ఏమిటంటే ఏ ప్రభుత్వమైతే విడుదల చేసిందో ఆ సర్కార్ కు చెందిన కాషాయ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ లు తీవ్రంగా తప్పు పట్టారు.
దోషులకు దండలు వేయడం, స్వీట్లు పంపిణీ చేయడాన్ని మండిపడ్డారు. స్త్రీత్వానికే కలంకమని ఖుష్బూ పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అయితే పూల దండలు కాదు ఉరి తాళ్లు వేయాలని పిలుపునిచ్చారు.
తాజాగా బిల్కిస్ బానో కేసులో దోషుల్ని రిలీజ్ చేయడంపై నిప్పులు చెరిగారు 134 మంది మాజీ బ్యూరోక్రాట్లు(134 Ex-Bureaucrats). వారిని విడుదల చేయడం అంటే మహిళా లోకాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
తమకే కాదు దేశానికే ఆగ్రహం తెప్పించిందని స్పష్టం చేశారు. శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి బహిరంగ లేఖ రాశారు.
ఈ భయంకరమైన తప్పును సరిదిద్దాలని అభ్యర్థించారు. ఉపశమన ఉత్తర్వును రద్దు చేయాలని, తిరిగి వారిని జైలుకు పంపించాలని కోరారు.
Also Read : గులాం నివాసంలో అసమ్మతి నేతల భేటీ